Movies In Tv: బుధ‌వారం (13.12.2023) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-12-12T21:12:06+05:30 IST

బుధ‌వారం (13.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో క‌లిపి దాదాపు 40 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. వీటిలో అధికంగా జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేశ్ సినిమాలు ఉండ‌నున్నాయి. అవేంటో,ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమాలు వ‌స్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధ‌వారం (13.12.2023) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

బుధ‌వారం (13.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో క‌లిపి దాదాపు 40 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. వీటిలో అధికంగా జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేశ్ సినిమాలు ఉండ‌నున్నాయి. అవేంటో,ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమాలు వ‌స్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో ఉద‌యం 8.30గంట‌లకు వెంక‌టేశ్‌, న‌య‌న‌తార‌ నటించిన ల‌క్ష్మి, మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు సూర్యా, అశిన్‌ న‌టించిన గ‌జిని ప్ర‌సారం కానున్నాయి.

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్, శివాజీ నటించిన ఒట్టేసి చెబుతున్నా టెలీకాస్ట్ కానుంది.

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో ఉద‌యం 7గంట‌లకు వేణు, నిఖిత‌ నటించిన క‌ళ్యాణ‌రాముడు, ఉద‌యం 10 గంట‌లకు సూర్యా, అశిన్‌ నటించిన దేవా, మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజేంద్ర ప్ర‌సాద్‌ నటించిన ఆ న‌లుగురు, సాయంత్రం 4 గంట‌లకు శివాజీ, రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌భాస్‌, త‌మ‌న్నా నటించిన రెబెల్, రాత్రి 10 గంట‌లకు ఉపేంద్ర‌ నటించిన ఒకేమాట‌ వంటి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

ఇక జీ(Zee) తెలుగులో ఉద‌యం 9 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌, శ్రీహ‌రి నటించిన అహా నా పెళ్లంట‌ సినిమా ప్ర‌సారం కానుంది.

జీ(Zee) సినిమాలులో ఉద‌యం 7 గంట‌లకు శ్రీరామ్‌,ల‌క్ష్మీరాయ్‌ నటించిన శివ గంగ‌, ఉద‌యం 10.00 గంట‌లకు శైలేంద్ర, ఈషా రెబ్బా నటించిన బ్రాండ్‌బాబు , మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, స‌మంత న‌టించిన‌ బ్ర‌హ్మోత్స‌వం, మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్ పోతినేని, ర‌కుల్‌ నటించిన పండ‌గ చేస్కో , సాయంత్రం 7 గంట‌లకు అల్లు అర్జున్‌,అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన నా పేరు సుర్య నా ఇల్లు ఇండియా, రాత్రి 10 గంట‌ల‌కు రామ్ పోతినేని, అనుప‌మ‌ నటించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ప్ర‌సారం కానున్నాయి.

ఈ టీవీ(E TV)లో ఉద‌యం 9 గంట‌లకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన మాయాబ‌జార్‌

ఈ టీవీ ప్ల‌స్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేష్, శోభన నటించిన అజేయుడు, రాత్రి 10 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన‌ సాంబ‌య్య‌ సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి.


ఈ టీవీ(E TV) సినిమాలో ఉద‌యం 7 గంట‌లకు చంద్రమోహన్, మురళీమోహన్, సుహాసిని న‌టించిన మ‌నిషికో చ‌రిత్ర‌, ఉద‌యం 10గంట‌ల‌కు వెంక‌టేశ్‌, మీనా న‌టించిన అబ్బాయిగారు, మ‌ధ్యాహ్నం 1 గంటకు హ‌రికృష్‌ణ‌, సుమ‌న్‌,వినీత్‌ నటించిన లాహిరిలాహిరిలో, సాయంత్రం 4 గంట‌లకు వెంకటేష్ నటించిన విజేత విక్ర‌మ్‌, రాత్రి 7 గంట‌ల‌కు వెంకటేష్, సుహాసిని నటించిన వార‌సుడొచ్చాడు, రాత్రి 10 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన‌ బృందావ‌నం సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

మా(Maa TV)టీవీలో ఉద‌యం 9 గంట‌లకు వెంకటేష్, సౌంద‌ర్య‌ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ప్రసారం కానుంది.

మా(Maa Gold) గోల్డ్‌లో ఉద‌యం 6.30 గంట‌లకు సందీప్ కిషన్, డింపుల్ నటించిన మ‌హేశ్‌, ఉద‌యం 8 గంట‌లకు సాయిరామ్‌శంక‌ర్‌ నటించిన 143 ఐల‌వ్ యూ, ఉద‌యం 11 గంట‌లకు వెంకటేష్, శ్రీదేవి న‌టించిన‌ క్ష‌ణ‌క్ష‌ణం, మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు వెంకటేష్,ర‌జ‌నీ నటించిన దృవ‌న‌క్ష‌త్రం, సాయంత్రం 5 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక‌ నటించిన ఖుషి, రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ తెలీకాస్ట్‌ , తిరిగి రాత్రి 11గంట‌ల‌కు వెంకటేష్,శ్రీదేవి న‌టించిన‌ క్ష‌ణ‌క్ష‌ణం సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్‌లో (Maa ) ఉద‌యం 7 గంట‌లకు రాయ్ లక్ష్మీ, మధునందన్, పూజిత పొన్నాడ నటించిన వేర్ ఇస్ ది వెంక‌ట ల‌క్ష్మి, ఉద‌యం 9 గంట‌లకు నితిన్‌, న‌భా న‌టేశ్ న‌టించిన‌ నటించిన మేస్ట్రో, మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంకటేష్, ఆర్తి అగ‌ర్వాల్‌ నటించిన నువ్వు నాకు న‌చ్చావ్‌, మధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ నటించిన ర‌క్త త‌ర్ప‌ణం, సాయంత్రం 6 గంట‌లకు వెంకటేష్, వ‌రుణ్ తేజ్‌ నటించిన ఎఫ్‌2 , రాత్రి 9 గంట‌ల‌కు వెంకటేష్, త్రిష‌ నటించిన న‌మో వెంక‌టేశ‌ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

Updated Date - 2023-12-12T21:24:39+05:30 IST