Varun Tej Konidela: కాబోయే అత్తవారింట్లో పండగ చేసుకున్న లావణ్య
ABN , First Publish Date - 2023-09-18T17:14:11+05:30 IST
వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్ధం కొన్ని నెలల కిందట అయిన సంగతి తెలిసిందే. ఈరోజు వినాయకచవితి పండగను లావణ్య తనకి కాబోయే అత్తవారింట్లో సెలెబ్రేట్ చేసుకుంది.
వినాయక చవితి #Vinayakachavithi పండగ అనగానే కుటుంబం అంతా ఇంట్లో వుండి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ వినాయకుడికి చేసుకునే పండగ. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కూడా తన కుటుంబంతో ఈ పండగను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. అయితే ఈ సంవత్సరం పండగలో ఒక విశేషం వుంది, ఆ కుటుంబానికి, అదేంటి అంటే, తమ కాబోయే కోడలు, నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) కూడా వాళ్ళతో పాటు పండగ చేసుకోవటం.
మామూలుగా అయితే పెళ్లయిన తరువాత అత్తవారింటికి వెళ్లి అన్ని పండగలు జరుపుకుంటారు, కానీ లావణ్య, వరుణ్ తేజ్ (VarunTej) ల నిశ్చితార్ధం మాత్రమే అయింది. #LavanyaVarunTej కానీ, ఇప్పటినుండే కాబోయే అత్తగారింటికి వెళ్లి, అత్తగారితో పూజ చేసింది లావణ్య. ముందు రోజుల్లో తనకి వరుణ్ తేజ్ కి వివాహం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగిపోవాలని ఆ విఘ్నరాజాధిపతిని మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది.
లావణ్య ఆ ఇంటికి వెళ్లి పూజలో పాల్గొన్న ఫోటోస్ ని వరుణ్ తేజ సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేసాడు. అందులో లావణ్య, వరుణ్ తేజ్ మదర్ పూజ చేస్తున్నట్టు ఫోటో కూడా వుంది. అలాగే వరుణ్ తేజ్, లావణ్య, నాగబాబు, అతని భార్య చెరో పక్క నిలుచొని వున్న ఫోటోస్ కూడా పోస్ట్ చేసాడు వరుణ్. ఈ ఫోటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.