Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

ABN , First Publish Date - 2023-12-15T13:58:36+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ని విడుదల చేయగా.. అది కాస్త ట్రోలింగ్‌కు గురవుతోంది. ట్రోలింగ్‌పై రామ్‌జో అసహనం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ నుండి వెళ్లిపోయారు.

Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!
Ramajogayya Sastry and Guntur Kaaram Still

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (S Radhakrishna) నిర్మిస్తోన్న సినిమా ‘గుంటూరు కారం’ (Guntru Kaaram). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ని కూడా మొదలెట్టారు. మొన్నటి వరకు అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలను ఎదుర్కొని.. ఎవరూ ఊహించని విధంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. సంక్రాంతి (Sankranthi)కి రావడం పక్కా అనేలా సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సెకండ్ సింగిల్ మాత్రం.. భారీగా ట్రోలింగ్‌కు గురవుతోంది.

‘గుంటూరు కారం’కు సంబంధించి మొదట విడుదలైన ‘థమ్ మసాలా’ సాంగ్ అందరినీ అలరించింది. అదే ఊపులో సెకండ్ సింగిల్‌కు సంబంధించి విడుదలకు ముందు చేసిన హడావుడి.. సాంగ్‌పై భారీగా అంచనాలను పెంచేసింది. తీరా.. సాంగ్ విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంతా నిరాశకు లోనవుతున్నారు. అందుకు కారణం.. విడుదలకు ముందు చేసిన హడావుడంత గొప్పగా లేకపోవడమే. థమన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.. ఏదీ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. అంతే సోషల్ మీడియా వేదికగా.. థమన్‌ని, రామ్‌‌జోని టార్గెట్ చేస్తూ.. ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ ట్రోలింగ్‌పై అసహనం వ్యక్తం చేసిన రామజోగయ్య శాస్త్రిని మరింతగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో చేసేది లేక.. ట్విట్టర్‌కు రామజోగయ్య బై బై చెప్పేశారు. (Ramajogayya Sastry Out From Twitter)


Mahesh-Babu.jpg

వాస్తవానికి ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela) మద్య వచ్చిన ఈ పాటలో.. సూపర్ స్టార్ గత సినిమాలకు లింక్ అయ్యేలా రామజోగయ్య సాహిత్యాన్ని అల్లారు. కానీ ట్యూన్ క్యాచీగా లేకపోవడంతో.. లిరిక్స్ కూడా పెద్దగా శ్రోతలకు ఎక్కలేదు. అంతే.. అసలు ఇది పాటేనా? ఏం ఊహించుకుని రాస్తున్నారు.. ఆ ఇంగ్లీష్ పదాలేంటి? హీరో ఎవరని అనుకుంటున్నారు? ఇంత చెత్త పాట ఇంత వరకు వినలేదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా భగ్గుమన్నారు.

ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్‌పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి.. ‘‘ప్రతివాడూ మాట్లాడే వాడే... రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం... తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి’’ అంటూ ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చినట్లుగా ట్విట్టర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అంతే.. ట్రోలర్స్‌కి పూర్తిగా దొరికేశారు. ‘అసలు పాటలో ఏముందని.. తక్కువ అవడానికి, ఏమైనా ఉంటే కదా’, ‘తెలుగుదనం తక్కువైంది.. త్రివిక్రమ్ సినిమాలకు, మహేష్ బాబు సినిమాలకు సిరివెన్నెల ఎంత బాగా రాసేవారో.. అదే మీ పాటలో కొరవడింది..’, ‘లిరిక్స్ బాలేవ్.. అది చెబుతుంటే.. ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లమ్.. సాంగ్ బాగుంటే ఇప్పటికి మిలియన్ల వ్యూస్ లెక్కపెట్టుకునే వాళ్లం.. అలా జరగలేదే’, ‘రచయితలకు ఆత్మపరిశీలన ముఖ్యం.. అది వదిలేసి నా పాటకు ఏం తక్కువైంది అంటూ ఇలా పబ్లిక్‌లో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు’.. అంటూ.. రామజోగయ్య శాస్త్రిపై నెటిజన్లు ఒక రకంగా యుద్ధమే మొదలెట్టారు. ఈ యుద్ధాన్ని తట్టుకోవడం రామ్‌జో వల్ల కాలేదు. అందుకే ‘మీకో దండంరా నాయనా’ అనేలా ట్విట్టర్ అకౌంట్ మూసేసి.. భీకరంగా మారుతోన్న ట్రోలింగ్ అనే యుద్ధానికి కాస్త ముగింపు పలికారు. (Fans Starts War on Ramjo)


Sreeleela.jpg

వాస్తవానికి మహేష్, త్రివిక్రమ్ (Mahesh and Trivikram) కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ముఖ్యంగా ‘ఖలేజా’ సినిమాలోని శివుడి పాటను రాసింది ఆయనే. అలాగే మహేష్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలలో కూడా రామ్‌జో చాలా మంచి సాహిత్యం సమకూర్చి.. ఆయా సినిమాల సక్సెస్‌కు ఒక కారణంగా నిలిచారు. కానీ.. ఈ పాట విషయంలోనే ఎందుకో ఆయన ఫ్యాన్స్‌ని సంతోషపరచలేకపోయారు. ఫలితంగా ట్రోలింగ్‌కు గురికావడం, తట్టుకోలేక సోషల్ మీడియాని వదిలేసి వెళ్లిపోవడంతో.. ఇప్పుడంతా రచ్చ రచ్చ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు.. ఈ విధంగానైనా సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

====================

*Bunny Vas: జనసేన పార్టీలో నిర్మాత బన్నీ వాస్‌కు కీలక బాధ్యత

**************************************

*Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం

************************************

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

Updated Date - 2023-12-15T13:58:38+05:30 IST