Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?

ABN , First Publish Date - 2023-04-25T15:40:14+05:30 IST

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వెనుక ఏపీ, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉన్నారని జనసేన నేత చేసిన ఆరోపణల దృష్ట్యా ఈ ఐటీ రైడ్స్ జరిగినట్లుగా టాక్ నడుస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన చూస్తే

Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?
Pawan Kalyan and Mythri Movie Makers Logo

ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ (Sukumar) ఆఫీస్‌లపై ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఏం దొరికాయనేది పక్కన పెడితే.. ఈ సోదాలకు కారణం.. జనసేన పార్టీ (Janasena Party)కి చెందిన ఓ నేత అనేలా టాక్ నడుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వెనుక ఏపీ, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉన్నారని జనసేన నేత చేసిన ఆరోపణల దృష్ట్యా ఈ ఐటీ రైడ్స్ జరిగినట్లుగా టాక్ నడుస్తుంది. తాజాగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. విషయంలోకి వస్తే..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ వెనుక తెలంగాణ మంత్రి (Telangana Minister) తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), ఏపీ మంత్రి (Andhra Pradesh Minister) బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) పెట్టుబడులు ఉన్నాయని, వారి ఫారిన్ వ్యాపారాలకు సంబంధించిన ఆదాయాన్ని.. ఈ బ్యానర్‌ ద్వారా వైట్ మనీ‌గా మార్చుకుంటున్నారంటూ.. జనసేన వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ (Murthy Yadav) కొన్ని ఆరోపణలు చేయడంలో.. అది ఐటీ దాడులకు కారణమైందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే తాజాగా జరిగిన సోదాలలో.. ఈ బ్యానర్ వెనుక ఆ మంత్రుల సపోర్ట్ (Minister Support) ఉందనేలా ఏ ఒక్క ఆధారం కూడా ఐటీ అధికారులకు లభించలేదట. మరి దీనిని దృష్టిలో పెట్టుకుని చేశారో.. లేదంటే వేరే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారికంగా తన పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. (Pawan Kalyan Released Press Note)

Balineni.jpg

‘‘పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి. వారి సూచనలు, సలహా మేరకు మీరు మాట్లాడంటి’’ అంటూ.. కొన్ని విషయాలను పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు.

ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండి అంటూ..

1. సరైన ధృవపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి

2. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.

3. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.

4. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు.. అని పవన్ కల్యాణ్ ఈ ప్రకటనలో తెలిపారు. అయితే ఇదంతా మైత్రీపై ఐటీ దాడులను ఉద్దేశించే ఆయన ఈ ప్రకటనను విడుదల చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

Pawan-Kalyan.jpg


ఇవి కూడా చదవండి:

************************************************

*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

Updated Date - 2023-04-25T18:59:38+05:30 IST