The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

ABN , First Publish Date - 2023-08-15T16:58:29+05:30 IST

ఈ మధ్య ప్రభాస్‌ని, ప్రభాస్ సినిమాని టార్గెట్ చేస్తూ నేనేం అనలేదు.. ప్రభాస్ అంటే నాకూ ఇష్టమే అంటూ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అన్ని మాటలు చెప్పిన ఆయన.. తను డైరెక్ట్ చేస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రాన్ని ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 28నే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..
The Vaccine War vs Salaar

ఈ మధ్య ప్రభాస్‌ని, ప్రభాస్ సినిమాని టార్గెట్ చేస్తూ నేనేం అనలేదు.. ప్రభాస్ (Prabhas) అంటే నాకూ ఇష్టమే అంటూ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri) కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమాకు పోటీగా తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలను రిలీజ్ చేస్తాననేలా ఆయన మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలకు వివరణ ఇస్తూ.. వివేక్ రంజన్ ఆ కామెంట్స్ చేశారు. అయితే అన్ని మాటలు చెప్పిన ఆయన.. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు పోటీగా తను డైరెక్ట్ చేస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War)ని దించేందుకు సిద్ధమవుతుండటం విశేషం. తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.


కానీ రెబల్ స్టార్ ప్రభాస్ (Rabel Star Prabhas) ‘సలార్’ సినిమా కూడా అదే డేట్‌కి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘సలార్’ విడుదల తేదీని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయినా కూడా వెనుకాడకుండా.. అదే రోజు ‘ది వ్యాక్సిన్ వార్’తో బాక్సాఫీస్ వార్‌కి సిద్ధమవుతున్నారు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఆయన రూపొందిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు.. కమర్షియల్‌గానూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ ధైర్యమే ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్’ విషయంలోనూ ‘సలార్’ (Salaar)తో ఢీ కొట్టేందుకు సిద్ధం చేస్తోంది.

‘ది వ్యాక్సిన్ వార్’ విషయానికి వస్తే.. ఈ సినిమా దేశంలో COVID-19, వ్యాక్సిన్ డ్రిల్ల్స్ గురించి కొన్ని అధ్యాయాలను చూపనుంది. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. పల్లవి జోషి సైంటిస్ట్‌గా కనిపించగా, తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో నానా పటేకర్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ఇంతకుముందు ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అసోషియేట్ అవుతున్నారు. ‘ది వ్యాక్సిన్ వార్’ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10+ భాషల్లో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Karthikeya: నేనలా అనలేదు.. దయచేసి నటీనటులపై ఇలాంటివి మానుకోండి

***************************************

*VT13: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రానికి టైటిల్ ఖరారు.. టైటిల్ ఏంటంటే..

***************************************

*Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?

***************************************

Updated Date - 2023-08-15T16:58:29+05:30 IST