Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.

ABN , First Publish Date - 2023-06-22T23:09:13+05:30 IST

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల.. తను సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకుంది. ఓ పెద్దావిడ చెప్పిన మాటలతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దేవాలయం కన్నా గొప్పది అని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.
Heroine Sreeleela

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రంలో శ్రీలీల (Sreeleela) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ సర్కిల్‌లో ఏ ఫంక్షన్ జరిగినా.. అందులో శ్రీలీల ప్రత్యక్షం అవుతోంది. తాజాగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 23వ వార్షికోత్సవంలోనూ శ్రీలీల మెరిసింది. ‘‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital).. ఈరోజు హాస్పిటల్ ఒక దేవాలయం కన్నా గొప్పదిలా మారింది అంటే కారణం బాలయ్య’’ అంటూ.. ఈ హాస్పిటల్‌కి సంబంధించిన ఓ సంఘటనను ఈ వేడుకలో శ్రీలీల షేర్ చేసుకుంది.

‘‘బాలకృష్ణగారికి కూడా ఈ విషయం తెలియదు. మా సెట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సీన్ షూట్ చేసేటప్పుడు.. నా కేర్ టేకర్ రోల్ ప్లే చేస్తున్న ఓ పెద్దావిడ.. సడెన్‌గా పక్కకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగితే.. బాధతో కాదు.. ఈ కన్నీళ్లు సంతోషంతో వస్తున్నాయని అంది. ఏంటి విషయం అని అడిగాను. అప్పుడామె.. తను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు ఎవరూ తనకు హెల్ప్ చేయలేదని చెప్పింది. ట్రీట్‌మెంట్‌కి చాలా డబ్బులు కావాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. అప్పుడు నేను బసవతారకం హాస్పిటల్‌కి వచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు హెల్ప్ చేయని పరిస్థితుల్లో.. హాస్పిటల్ వాళ్లే నాకు ఫ్యామిలీలా నిలబడ్డారు. ఈ రోజు నేను కోలుకుని.. మళ్లీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నానంటే.. అందుకు కారణం ఆ హాస్పిటలే అని చెప్పారు. చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది..’’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. (Heroine Sreeleela)

Sreeleela.jpg

‘నేను హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు చాలా భయంగా వెళ్లాను కానీ.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా ధైర్యంగా వచ్చాను’ అని ఆ పెద్దావిడ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నానని చెబుతూ.. బాలయ్యకు శ్రీలీల ధన్యవాదాలు తెలిపింది. ఇక శ్రీలీల విషయానికి వస్తే.. ఆమె ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు డాక్టర్ (Doctor) అవ్వాలనే తన కలను సాకారం చేసుకునేందుకు కష్టపడుతోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

*Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..


**************************************

*MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’


**************************************

*Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు


**************************************

*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?


**************************************

*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు


**************************************

Updated Date - 2023-06-22T23:09:13+05:30 IST