Serial Artists: ఎల్.బి. నగర్ దసరా, బతుకమ్మ సంబురాల్లో సీరియల్ నటీనటుల సందడి

ABN , First Publish Date - 2023-10-20T20:09:42+05:30 IST

దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా‌లో వచ్చే సీరియల్స్‌లో నటించే నటీనటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాతాలలో ఉన్న దుర్గా పూజా మండపాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా వారు ఎల్.బి. నగర్‌లో సందడి చేశారు.

Serial Artists: ఎల్.బి. నగర్ దసరా, బతుకమ్మ సంబురాల్లో సీరియల్ నటీనటుల సందడి
Serial Stars at Dasami and Bathukamma Celebrations

దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా‌లో వచ్చే సీరియల్స్‌లో నటించే నటీనటులు (Serial Artists) సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వివిధ ప్రాతాలలో ఉన్న దుర్గా పూజా మండపాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా ఎల్.‌బి. నగర్‌లో పలువురు సినీ స్టార్స్ వేదిక అయ్యారు. ‘స్టార్ మా’లో వచ్చే ‘కృష్ణా ముకుంద మురారి, మామగారు, వంటలక్క మరియు పాపే మా జీవనజ్యోతి’ సీరియల్స్‌లో నటించే నటీనటులు ఎల్.బి. నగర్‌లోని దుర్గా పూజా మండపాలను సందర్శించి.. తమ అభిమానులతో సంతోషంగా గడిపి.. వారికి మెమరబుల్ క్షణాలను అందించారు. (Dussehra Celebrations)


Star-Maa.jpg

ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద వారంతా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ, సమిష్టి స్ఫూర్తిని చాటుతూ తమ అభిమానులతో ఆనందంగా గడిపారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఈ విధంగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు గణపతి ఉత్సవాలలోనూ కొందరు సీరియల్ తారలు ఇలానే సందడి చేశారు. ఇప్పుడు దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను సదరు ఛానెల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ఈ కార్యక్రమం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Bathukamma Celebrations)


ఇవి కూడా చదవండి:

============================

*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

*******************************************

*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?

************************************

*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?

**********************************

*Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ అయిపోయింది..

************************************

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

Updated Date - 2023-10-20T20:09:42+05:30 IST