Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

ABN , First Publish Date - 2023-04-27T14:03:35+05:30 IST

అన్నయ్యా.. అంటూ ఎంతో ఆప్యాయంగా సముద్రఖని రాసిన ఈ లేఖను మెగా ఫ్యాన్స్ (Mega Fans) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీ మనసులోంచి

Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..
PKSDT Movie On Location Pic

విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు సముద్రఖని (Samuthirakani) పుట్టినరోజును పురస్కరించుకుని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖను, పవన్ కల్యాణ్ తెలిపిన శుభాకాంక్షలను (Birthday Greetings) చూసి సముద్రఖని ఎంతగానో పరవశించిపోయారు. ఆ విషయాన్ని తెలుపుతూ.. తను కూడా ట్విట్టర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. అన్నయ్యా.. అంటూ ఎంతో ఆప్యాయంగా సముద్రఖని రాసిన ఈ లేఖను మెగా ఫ్యాన్స్ (Mega Fans) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీ మనసులోంచి వచ్చిన ఈ మాటలు నిజమవ్వాలని మేమూ కోరుకుంటున్నామనేలా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ సముద్రఖని రాసిన లేఖలో ఏముందంటే.. (Samuthirakani Letter)

‘‘అన్నయ్యా, నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని నాలో నింపింది. ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న ప్రేమ, అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మిల్ని నడిపించాలని మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తాను’’ అని సముద్రఖని తన లేఖలో తెలిపారు.

Khani.jpg

అంతకు ముందు పవన్ కల్యాణ్ తన లేఖలో.. ‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో అటువంటి సమాజం కోసం తపిస్తారు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని (National Award) అందుకున్నారు. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను..’’ అని తెలిపారు. కాగా.. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ (Sai Dharam Tej) తేజ్‌లో హీరోలుగా ‘PKSDT’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.

Samuthirakani.jpgఇవి కూడా చదవండి:

************************************************

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

*N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

Updated Date - 2023-04-27T14:03:35+05:30 IST