Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!
ABN , First Publish Date - 2023-03-29T17:57:37+05:30 IST
జోర్దార్ సుజాత (Jordar Sujatha) తనని టార్చర్ పెట్టిందని, అందుకే ఆమెను ప్రేమించాల్సి వచ్చిందని, పెళ్లి కూడా చేసుకోవాల్సి వచ్చిందని తాజాగా రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చెబుతూ..
జోర్దార్ సుజాత (Jordar Sujatha) తనని టార్చర్ పెట్టిందని, అందుకే ఆమెను ప్రేమించాల్సి వచ్చిందని, పెళ్లి కూడా చేసుకోవాల్సి వచ్చిందని తాజాగా రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చెబుతూ.. రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) బాధపడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి.. షాక్ అయ్యారా? నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న ఈ క్యూట్ కపుల్ మధ్యలో అప్పుడే గొడవలా? పెళ్లికి ముందు ఈ జంట గురించి ఎలా వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. జోర్దార్ సుజాతకు తన స్కిట్స్‌లో చోటివ్వడమే కాకుండా.. పెళ్లి చేసుకుని తన జీవితంలోకి ఆహ్వానించిన రాకింగ్ రాకేష్‌పై అందరూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇద్దరూ చూడచక్కగా ఉన్నారంటూ అంతా చెప్పుకున్నారు. అలాంటిది, ఇప్పుడు సడెన్‌గా రాకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేంటని అనుకుంటున్నారు కదా! (Rocking Rakesh Shocking Comments)
అసలు విషయంలోకి వస్తే.. పెళ్లి తర్వాత కూడా సుజాత ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) స్కిట్స్‌లో చేస్తుంది. తాజాగా ఈ శుక్రవారం రాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘నిజం చెబితే కాయ చెట్టు పైకి వెళ్తుంది.. అబద్ధం చెబితే కాయ కదలదు’ అనే కాన్సెప్ట్‌తో రాకేష్ అండ్ టీమ్ స్కిట్ చేశారు. ఈ ప్రోమోలో రాకేష్‌ని చెట్టుకు కట్టేసి.. ‘పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకున్నావా?’ అని రైజింగ్ రాజు (Raising Raju) అడిగితే.. ‘మాది ఒక పవిత్రమైన ప్రేమ’ అని రాకేష్ క్యాజువల్‌గా చెప్పినప్పుడు చెట్టుకు వేలాడుతున్న కాయ లేవలేదు. ఆ తర్వాత ‘బొంగులో లవ్వు అండి.. బొంగులో లవ్వు. టార్చర్ పెట్టిందండి ప్రేమించేదాకా.. పెళ్లి చేసుకునే దాకా’ అని చెప్పగానే చెట్టుకున్న కాయ పైకి కదులుతుంది. ఇది జబర్దస్త్‌లో స్కిట్ కావచ్చు, సరదాగా చేసి ఉండవచ్చు.. కానీ, నిన్నగాక మొన్న పెళ్లి అయిన భార్యపై రాకింగ్ రాకేష్ ఇలానేనా మాట్లాడేది. రాకేష్ కామెంట్స్‌తో.. ఇప్పుడు నిజంగానే అలా జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. (Rocking Rakesh Extra Jabardasth Skit)
ఎందుకంటే.. ఒక సామెత ఉంది కదా.. నిప్పులేనిదే పొగ రాదు అని. అలాగే తాజాగా రాకేష్ చేసిన కామెంట్స్‌ని కూడా చూస్తున్నారు. ఎంత టీఆర్పీ (TRP) కోసం అయితే మాత్రం.. మరీ పర్సనల్‌గా వెళతారా? ఎంత కామెడీ కోసం అయితే మాత్రం ఏం లేకుండానే.. ఇలాంటి మాటలు వస్తాయా? గతంలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), రష్మీ(Rashmi)లపై ఇలాంటివి చాలా వచ్చాయి. కానీ వారు భార్యభర్తలు కారు. అసలు వారి మధ్య ఏం ఉందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది టీఆర్పీ కోసం వారిద్దరికి ప్రేమ ఉన్నట్లు ఒకసారి, పెళ్లి చేసేసి మరోసారి.. ఇలా రకరకాలుగా వారిని వాడుకున్నారు. కానీ, పెళ్లైన తర్వాత భార్య విషయంలో రాకేష్ ఇలా చేయడం ఏం బాగాలేదంటూ.. ఆయనని అభిమానించే వారే మాట్లాడుకుంటుండటం విశేషం. అయితే ఇది దేని కోసం అయితే చేశారో.. ఆ విషయంలో మాత్రం ఈ ప్రోమో (Extra Jabardasth Promo) బాగానే వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతోంది. మరి ఫుల్ స్కిట్‌లో రాకేష్ ఇంకెన్ని విషయాలు రివీల్ చేశాడో.. తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
*********************************
*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?
*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది
*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!
*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక
*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?