Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

ABN , First Publish Date - 2023-04-10T17:18:39+05:30 IST

రేణు దేశాయ్ నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఓ సామాజికవేత్త మాట్లాడిన వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్.. మెగాభిమానులకు మరోసారి కౌంటర్ ఇచ్చారు..

Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది
Renu Desai

నటి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ వీడియోని షేర్ చేసి.. ఆ వీడియోలో ఉన్న కంటెంట్‌తో ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో విడాకుల అనంతరం.. రేణు దేశాయ్ తన పిల్లల ఉన్నతిని చూసుకుంటుంది. రీసెంట్‌గా కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) పుట్టినరోజున.. మెగాభిమానులు (Mega Fans) చేసిన ఓ పోస్ట్ ఆమెను బాగా హర్ట్ చేసింది. ‘మా అన్న కొడుకు.. మా అన్న కొడుకు’ అంటూ ఫ్యాన్స్ చేసిన హడావుడిపై.. రేణు దేశాయ్ ఫైర్ అయింది. ‘మీ అన్న కొడుకు కాదు.. అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి’ అంటూ మెగాభిమానులకు రేణు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ కూడా దాదాపు మెగా ఫ్యాన్స్‌కి మరో కౌంటర్‌లానే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Read Also- MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం

రేణు దేశాయ్ నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఓ సామాజికవేత్త మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆమె.. ఈ వీడియోను నాకు ఒకరు పంపారు. ఇందులో ఉన్నావిడ ఎవరో నిజం నాకు తెలియదు (Unknown Person). నా గురించి ఎందుకు ఆమె మాట్లాడారో కూడా తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్​లో ఒకరు నా తరపున మాట్లాడటం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెబితే.. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది అని తెలుపుతూ ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ రేణు దేశాయ్ ఎమోషనలైంది.

ఇక రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. ఓ సామాజికవేత్త (Social Activist) మాట్లాడుతూ... హీరో, హీరోయిన్లు విడిపోతే హీరో గురించి ఎవరూ మాట్లాడరు కానీ.. హీరోయిన్​నే ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి విషయంలో సమాజం మహిళల దగ్గర నుంచే రెస్పాన్సిబిలిటీని కోరుకుంటుంది. మహిళ నుంచే జవాబుదారీతనాన్ని కోరుకుంటుంది. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్​‌ సహజీవనం (Pawan Kalyan and Renu Desai) చేసి బిడ్డలను కన్నది. ఆయనకు అన్ని విషయాలలో ఆమె సహకారం అందించింది. ఆమె కనుక నాకు సహజీవనంలో బిడ్డ పుట్టలేదు.. ఏ గుడిలోనో, ఎక్కడో మాకు పెళ్లయింది అని ఒక్క మాట చెబితే పవన్ కల్యాణ్‌కు జైలు శిక్ష పడేది. సమాజం నుంచి సహానుభూతి కావాలి. ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకూడదు అంటూ స్త్రీ వేరు, పురుషుడు వేరు అనేలా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. సమాజం నుంచి వచ్చే వేళ్లన్నీ కూడా స్త్రీల వైపు మాత్రమే చూపిస్తాయి అంటూ చెబుతోంది. రేణు దేశాయ్ విషయానికి వస్తే.. మళ్లీ ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-10T17:18:41+05:30 IST