2023 Movies: 2023లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలివే..
ABN , First Publish Date - 2023-01-02T19:25:43+05:30 IST
2022 ముగిసింది. 2023లోకి అడుగుపెట్టాం. అంతకుముందు కరోనాతో అన్ని ఇండస్ట్రీలు కుదేలయ్యాయి. అందులో సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) కూడా ఉంది. కరోనా టైమ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి
2022 ముగిసింది. 2023లోకి అడుగుపెట్టాం. అంతకుముందు కరోనాతో అన్ని ఇండస్ట్రీలు కుదేలయ్యాయి. అందులో సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) కూడా ఉంది. కరోనా టైమ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఓటీటీ (OTT)లు మరో ఆప్షన్‌గా దొరకడంతో.. కరోనా హవా కాస్త తగ్గిన తర్వాత కూడా.. థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా మారలేదు. మౌత్ టాక్ బాగుంటేనే.. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా.. రెండు మూడు వారాలు థియేటర్లలో ఉంటే గొప్పే అనే పరిస్థితులు ప్రస్తుతం నడుస్తున్నాయి. అలాగే నాలుగైదు వారాల్లో ఓటీటీలలోకి కూడా వచ్చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితులలో మార్పు రావాలంటే.. థియేటర్లలో సినిమా మళ్లీ నిలబడాలంటే.. దర్శకనిర్మాతలు కంటెంట్ ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాల్సిందే. కంటెంట్ ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అంతగా ప్రేక్షకులలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం విడుదల తేదీలు ఫిక్స్ చేసుకున్న సినిమాల లిస్ట్ ఒక్కసారి పరిశీలిద్దాం.
జనవరి 2023
వారసుడు (జనవరి 12)
వీరసింహారెడ్డి (జనవరి 12)
తెగింపు (జనవరి 12)
వాల్తేర్ వీరయ్య (జనవరి 13)
కళ్యాణం కమనీయం (జనవరి 14)
విద్య వాసుల అహం (జనవరి 14)
పఠాన్ (జనవరి 25)
హంట్ (జనవరి 26)
గీత సాక్షిగా (జనవరి 26)
బుట్టబొమ్మ (జనవరి 26)
రెబల్స్ ఆఫ్ తుపాలకులగూడెం (జనవరి 26)
ఫిబ్రవరి 2023
రైటర్ పద్మభూషణ్ (ఫిబ్రవరి 03)
అమిగోస్ (ఫిబ్రవరి 10)
దాస్ కా ధమ్కీ (ఫిబ్రవరి 17)
శాకుంతలం (ఫిబ్రవరి 17)
వినరో భాగ్యము విష్ణు కథ (ఫిబ్రవరి 17)
సార్ (ఫిబ్రవరి 17)
మార్చి 2023
దసరా (మార్చి 30)
ఏప్రియల్ 2023
రావణాసుర (ఏప్రియల్ 07)
భోళాశంకర్ (ఏప్రియల్ 14)
రుద్రుడు (ఏప్రియల్ 14)
విరూపాక్ష (ఏప్రియల్ 21)
పొన్నియిన్ సెల్వన్ (ఏప్రియల్ 28)
పంజా వైష్ణవ్ తేజ్ నాల్గవ చిత్రం (ఏప్రియల్ 29)
మే 2023
కస్టడీ (మే 12)
జూన్ 2023
జవాన్ (జూన్ 02)
ఆదిపురుష్ (జూన్ 16)
ఆగస్ట్ 2023
SSMB28 (ఆగస్ట్ 11)
యానిమల్ (ఆగస్ట్ 11)
సెప్టెంబర్ 2023
సలార్ (సెప్టెంబర్ 28)
ఇవి కాకుండా ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప2’ వంటి చిత్రాలు కూడా 2023లో రానున్నాయి. అయితే వీటిలో ఏ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయో.. ఏవి ఓటీటీలో మెప్పిస్తాయో తెలియాలంటే.. సినిమాలు విడుదలయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.