Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

ABN , First Publish Date - 2023-04-06T15:57:56+05:30 IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై గత కొంత కాలంగా ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. తాజాగా వారిద్దరికి సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుందంటూ నెటిజన్ చేసిన ట్వీట్ రష్మిక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.. అదేంటంటే?

Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?
Rashmika Mandanna and Vijay Deverakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ల రిలేషన్‌పై ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ సహజీవనం (Live in Relationship) చేస్తున్నారని, పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారనేలా ఎప్పుడూ ఏదో ఒక వార్త.. ఈ జంటపై వినిపిస్తూనే ఉంటుంది. ఆ వార్తలకు తగినట్లే వారు కూడా కలిసి కనిపించడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడం వంటివి చేస్తూ.. సోషల్ మీడియాకు పని కల్పిస్తుంటారు. రీసెంట్‌గా మాల్దీవులకు ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరూ కూడా స్నేహితులమని చెబుతున్నారు గానీ.. ఇద్దరి మధ్య ఉన్న బంధంపై మాత్రం పెదవి విప్పడం లేదు.

Also Read-Manchu Manoj: సెగ గడ్డ వచ్చింది... గోకుతారా కొంచెం... మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్


ఒకవైపు రక్షిత్ శెట్టి (Rakshit Shetty)‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన రష్మిక మందన్నా.. సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకుని అతనికి షాకిచ్చింది. ఆ తర్వాత నటనపైనే కొంతకాలం పాటు ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతూ.. వరుస అవకాశాలను సొంతం చేసుకుని.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన ‘గీత గోవిందం’ (Geetha Govindham) చిత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌లా మారింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేలా వార్తలు బయటికి వచ్చాయి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. కేవలం స్నేహితులం మాత్రమే అని వారు చెబుతున్నప్పటికీ.. ఇద్దరూ కలిసి చేసే పనులు వారి మధ్య అంతకు మించిన బంధం ఏదో కొనసాగుతుందనే అనుమానాలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. అయితే ఇలా ఆలోచించి, అనుమానాలను వ్యక్తం చేసే వారందరికీ తాజాగా రష్మిక ట్విట్టర్ వేదికగా జవాబిచ్చింది.

Vijay.jpg

‘రష్మిక మందన్నా, విజయ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారనేది నిరూపితమైంది. ఇది నిజంగా నిజం. ఎలా అంటే.. విజయ్ దేవరకొండకు ఎంతో ఇష్టమైన ఉంగరాన్ని రష్మిక మందన్నా తన వేలికి ధరించింది. వారిద్దరూ ఒకే ఇంట్లో, ఒకే గదిలో కలిసి జీవిస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే ఓ గ్రేట్ న్యూస్ రానుంది..’ అంటూ సౌత్ డిజిటల్ మీడియాకు చెందిన ట్విట్టర్ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌కు రష్మిక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘అయ్యో.. బాబు దీనిపై అతిగా ఆలోచించమాకు’ (Aiyoooo.. don’t over think it babu) అంటూ.. రష్మిక, విజయ్‌ల (Rashmika Mandanna and Vijay Deverakonda) గురించి, వారి మధ్య ఉన్న బంధం గురించి ఆలోచించే వారందరికీ.. ఇదే నా సమాధానం అన్నట్లుగా రష్మిక స్పందించింది.


ఇవి కూడా చదవండి:

*********************************

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?

*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!

Updated Date - 2023-04-06T15:57:57+05:30 IST