RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి
ABN , First Publish Date - 2023-03-15T19:21:24+05:30 IST
సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. తాజాగా నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడెమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు
సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Acharya Nagarjuna University) అకాడెమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు (Controversy) దారి తీస్తున్నాయి. యూనివర్సటి స్టూటెండ్స్, ప్రొఫెసర్స్ ముందు ఆయన ‘తాగండి, తినండి, శృంగారం చేయండి’ అంటూ అసభ్యకరంగా మాట్లాడితే.. ఆయన మాటలకు యూనివర్సిటీ వీసీ కూడా వత్తాసు పలకడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వర్మ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వీధికుక్కలను ఉద్దేశించి.. GHMC మేయర్‌పై రకరకాల వీడియోలతో రెచ్చిపోయిన వర్మ.. ఆమెపై ఓ సాంగ్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ యూనివర్సటీ ప్రాంగణంలో.. స్టూడెంట్స్‌ని తప్పుదారి పట్టించేలా మాట్లాడుతూ మరోసారి వార్తలలో నిలిచారు.
నాగార్జున యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వర్మ (Varma) మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులంతా మీ ఇష్టం వచ్చినట్లు చేయండి.. ఎవరి మాటా వినవద్దు.. అప్పుడే పైకి వస్తారు. టీచర్లు, తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టి వారిని వేధించవద్దు. విద్యార్థులంతా మీకు నచ్చింది తినండి.. నచ్చిన బ్రాండ్ తాగండి.. శృంగారంలో పాల్గొండి. రేపు చచ్చాక పైన స్వర్గం ఉంటుందని, అందులో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి వారు ఉంటారని అపోహ పడవద్దు. ఒకవేళ లేకపోతే.. ఏం చేస్తారు? అందుకే ఉన్నన్ని రోజులూ ఎంజాయ్ చేయండి.. చేయలేకపోతే అది మూర్ఖత్వమే. నా వరకు నేను ఏమనుకుంటానంటే.. ఏదైనా వైరస్ వచ్చి ఈ ప్రపంచంలోని మగ జాతి మొత్తం అంతమైపోవాలి. నేను ఒక్కడినే బతికి ఎంజాయ్ చేయాలి. ఈ భూమి మీద ఉన్న మహిళలందరికీ నేనే ఆప్షన్ కావాలనేది నా డ్రీమ్. GST-2 ఎప్పుడని అడుగుతున్న వారందరికీ నేనిచ్చే సమాధానం ఏమిటంటే.. మీ దగ్గర సెల్ ఫోన్‌లు ఉన్నాయిగా.. మీరే అది తీసుకోవచ్చు’’ అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన సూచనలు, మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. (Ram Gopal Varma Speech at Nagarjuna University)
అయితే అదే ప్రాంగణంలో ఉన్న మహిళా లెక్చరర్స్, విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఆర్జీవీ (RGV) స్పీచ్‌కు షాక్ అవడమే కాకుండా.. తీవ్రంగా ఇబ్బందిపడినట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థునుల తల్లిదండ్రులు కూడా మండిపడినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ‘‘వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ కంటే ఎక్కువ. వర్మకు పీహెచ్‌డి, ఆస్కార్ (Oscar) కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి’’ అంటూ వర్మ తీరుకు యూనివర్సిటీ వీసీ వత్తాసు పలకడంతో విస్తుబోవడం ప్రాంగణంలో ఉన్నవారి వంతైంది. ఈ తతంగం అంతా చూస్తున్న వారు.. ఏది, ఎక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతామనేది వర్మకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు.. అన్నట్లుగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. (Director Ram Gopal Varma)
ఇవి కూడా చదవండి:
*********************************
*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..
*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?
*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది
*Dasara Trailer: ఇదీ ట్రైలర్ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!
*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి
*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?