Ram Charan: మైసూర్ నుంచి రామ్ చరణ్ రిటన్ వచ్చేశాడు.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-11-29T18:17:12+05:30 IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గానే కొత్త షెడ్యూల్ మైసూర్‌లో ప్రారంభమైంది. గురువారం తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. తన ఓటు వినియోగించుకునేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై.. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్‌గా అంచనాలకు ధీటుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) చేస్తోన్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే అంచనాలు అయితే ఉన్నాయి కానీ.. అనుకున్నంత ఫాస్ట్‌గా ఈ సినిమా షూటింగ్ నడవడం లేదు. ఏదో ఒక అవాంతరం ఈ సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణం అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో బాగా డిజప్పాయింట్ అవుతున్నారనే విషయం తెలియంది కాదు. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్‌గానే మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ కూడా ఈ షెడ్యూల్ షూట్ కోసం మైసూర్ చేరుకున్నట్లుగా కొన్ని వీడియోలు దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మైసూర్ (Mysore) నుండి రిటన్ వచ్చేశారు. ఎందుకని అనుకుంటున్నారా?
తెలంగాణ వ్యాప్తంగా గురువారం (నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటును వినియోగించుకునేందుకు.. రామ్ చరణ్ మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నట్లుగా ఓ వీడియో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ ఒక్కరే కాదు.. అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ (Hyderabad) చేరుకుంటున్నారు. ఇక తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. (Telangana Assembly Elections)
ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా రామ్ చరణ్.. షూటింగ్ వదలి, తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆయన చేస్తున్న ఈ ‘గేమ్ చేంజర్’ సినిమా కూడా ఎన్నికలకు సంబంధించినదే కావడం విశేషం. తమిళ దర్శకుడు శంకర్ (Shankar) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Telangana Elections: సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే..?
**********************************
*Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
*********************************
*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..
***********************************