Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!

ABN , First Publish Date - 2023-06-13T22:42:27+05:30 IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రభాస్ శ్రీను, సీనియర్ నటి తులసి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ఓ వార్త కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతోన్న నేపథ్యంలో.. తాజాగా ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తులసి నాకు తల్లితో సమానం.. అలాంటి ఆవిడతో నాకు సంబంధాలు అంటగడుతున్నారు. దయచేసి అలాంటి రాతలు రాయవద్దని తెలిపారు.

Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!
Tulasi and Prabhas Srinu

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడేం నమ్మడానికి వీలు లేకుండా పోయింది. ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi), సీనియర్ నరేష్ (Naresh VK) వంటి వారి పెళ్లిళ్ల తర్వాత.. ఏమో ఏదైనా జరగవచ్చు అనేలా.. వినిపిస్తున్న ప్రతి వార్తను నమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రభాస్ శ్రీను (Prabhas Srinu), సీనియర్ నటి తులసి (Tulasi) మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ఓ వార్త కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతోంది. మాములుగా తులసి అందరితో చాలా జోవియల్‌గా ఉంటుంది. సీనియర్ నటి కావడంతో.. తన కంటే చిన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. అలా ఓ సందర్భంలో ప్రభాస్ శ్రీను‌ను డార్లింగ్ అని పిలిచిందట. అంతే.. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

‘‘తులసిగారు సీనియర్ నటి. నాకు అమ్మతో సమానం. అలాంటి ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. నేను ఆవిడతో ఒకటి రెండు సినిమాలు తప్పితే.. ఎక్కువ సినిమాలు కూడా చేసింది లేదు. ‘డార్లింగ్’ (Darling) మూవీ షూటింగ్ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. ఆమె సీనియర్ నటి. జీవితంలో ఎన్నో చూసి.. ఈ స్థాయికి వచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆమె నన్ను చనువుగా డార్లింగ్ అని పిలిచారు. దానికే మా ఇద్దరి మధ్య ఏదో ఉందనేలా అర్థం చేసుకుని తప్పుతప్పుగా రాసేస్తున్నారు. మళ్లీ చెబుతున్నాను.. ఆమె నాకు తల్లితో సమానం.

Prabhas-Srinu-and-Tulasi.jpg

ఇంకో విషయం ఏమిటంటే.. ఈ రూమర్స్‌ విన్న తర్వాత ఆమె నాకో మెసేజ్ పెట్టారు. ఏమని అంటే.. ఆ పాడు వార్తలు చూసి మీ భార్య (Prabhas Srinu Wife) అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆమెకు వివరంగా చెప్పు అని మెసేజ్ పెట్టారు. అయినా నా భార్య డాక్టర్ (Doctor). మాది ప్రేమ వివాహం (Love Marriage). ఇలాంటి వార్తలను ఆమె నమ్మదు సరికదా.. మేమిద్దరం ఈ వార్తలు చూసి సరదాగా నవ్వుకున్నాం. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏమిటంటే.. తులసిగారు నాకు తల్లితో సమానం. అలాంటి ఆవిడతో నాకు ఎఫైర్ అంటూ రూమర్స్ క్రియేట్ చేయడం దయచేసి ఆపండి..’’ అని తనపై వస్తున్న రూమర్స్‌కి ప్రభాస్ శ్రీను క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్


**************************************

*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!

**************************************

*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

**************************************

*Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..

**************************************

*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!

**************************************

Updated Date - 2023-06-13T22:49:00+05:30 IST