Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!
ABN , First Publish Date - 2023-06-17T22:37:19+05:30 IST
గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ శుక్రవారం థియేటర్లలోకి రాగా.. విడుదలైన మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అనేలా సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా డే1 రిపోర్ట్స్ ప్రకారం.. తమిళనాడు, కేరళలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సీడెడ్‌లోనూ భారీ డిజాస్టర్ అనేలా కలెక్షన్స్ చెబుతున్నాయి.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush) శుక్రవారం థియేటర్లలోకి రాగా.. విడుదలైన మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అనేలా సోషల్ మీడియా అంతా ఒకటే టాక్. ప్రభాస్ (Prabhas) మినహా ఈ చిత్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నటుడు లేరు. లెక్క ప్రకారం ఇది బాలీవుడ్ చిత్రమే. దర్శకుడు బాలీవుడ్ దర్శకుడే. బాలీవుడ్‌లో బాలీవుడ్ వాళ్ల చిత్రాలు ఈ మధ్య భారీగా నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోని నమ్ముకున్న బాలీవుడ్ రాత ఏ మాత్రం మారలేదు అనేలా.. ప్రస్తుతం ‘ఆదిపురుష్’పై వస్తున్న టాక్ తెలియజేస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందు బుక్కయిన అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ వీకెండ్ ‘ఆదిపురుష్’దే అనేలా ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా చాలా వరకు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తోనే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడో రోజు ఆదివారం కావడంతో.. కలెక్షన్స్ స్టడీగానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆదిపురుష్‌కి అసలు పరీక్ష మొదలవుతుంది.
ఇక మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. విడుదలైన అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డ్ కలెక్షన్స్‌నే రాబట్టినా.. రెండు స్టేట్స్‌లో మాత్రం ‘ఆదిపురుష్’ సినిమా ప్రభావం చూపించలేకపోయింది. అయితే మొదటి నుంచి ఈ రెండు స్టేట్స్‌లో ‘ఆదిపురుష్’పై అస్సలు క్రేజ్ లేదనేలా.. వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు తగినట్లే.. అక్కడ డే 1 కలెక్షన్స్ నమోదు కావడం విశేషం. ఇంతకీ ఆ స్టేట్స్ ఏవని అనుకుంటున్నారా? తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala). ఈ రెండు స్టేట్స్‌లో డే 1న ‘ఆదిపురుష్’కి వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ. 2.5 కోట్లు (గ్రాస్) అంటే.. అక్కడ ‘ఆదిపురుష్’ అస్సలు ప్రభావం చూపలేకపోయాడనేది స్పష్టం అవుతోంది. (Adipurush Collections)
ఈ రెండు స్టేట్స్ సంగతి సరే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజించే ఆంధ్ర, నైజాం, సీడెడ్ ఏరియాలలోని ఒక ఏరియాలో కూడా ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆ ఏరియా ఏదో కాదు సీడెడ్ (Ceded). ఈ ఏరియాలో దాదాపు రూ. 18 కోట్ల వరకు బిజినెస్ జరగగా.. మొదటి రోజు కేవలం రూ. 3.5 కోట్లు మాత్రమే వచ్చినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ఏరియాలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రం డే 1న రూ. 6.5 కోట్లని కలెక్ట్ చేసింది. కానీ ఆదిపురుష్ విషయంలో అంత హంగామా జరిగినా కూడా సీడెడ్ ప్రేక్షకులు అంతగా రియాక్ట్ కాలేదు. ఈ ఏరియాలో నాన్ ఆర్ఆర్ఆర్ (Non RRR) డే1 రికార్డ్ విషయానికి వస్తే.. ఇప్పటికీ రామ్ చరణ్ యావరేజ్ సినిమా అయిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం పేరిటే ఉండటం విశేషం. మొత్తంగా అయితే ‘ఆదిపురుష్’కి పైన చెప్పుకున్న రెండు రాష్ట్రాలతో పాటు.. సీడెడ్ ఏరియాలో కూడా కోలుకోలేని దెబ్బ పడినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి డే1 ఇలా ఉంటే.. ఇప్పుడున్న టాక్‌తో ఈ ప్లేస్‌లలో రెండో రోజు మరింత దారుణంగా కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉందనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది
**************************************
*Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?
**************************************
*Adipurush: ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
**************************************
*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు
**************************************
*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్
**************************************