Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..
ABN , First Publish Date - 2023-10-21T21:43:15+05:30 IST
నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మహిళా సాధికారతకు సంబంధించిన బలమైన ఎలిమెంట్ ఇందులో ఉండటంతో మహిళా ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన హీరోయిన్ పూనమ్ కౌర్.. నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లో చేరానంటూ ట్వీట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari). దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన అన్ని చోట్లా సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోంది. బాలయ్య నటన, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే మహిళా సాధికారతకు సంబంధించిన బలమైన ఎలిమెంట్ ఇందులో ఉండటంతో మహిళా ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. (Poonam Kaur Tweet on Bhagavanth Kesari)
‘‘భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమా చూశాక నేను కూడా జై జై బాలయ్య బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నాను’’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వారంతా.. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ (Balayya Fans) ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సినిమాలో శ్రీలీలకు, బాలయ్యకు మధ్య వచ్చే సన్నివేశాలన్నీ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడే వారి నోళ్లు మూగబోతాయి. అలాంటి కంటెంట్‌ను అనిల్ రావిపూడి ఈ సినిమాకు సెట్ చేశారు. అందుకే సినిమా చూసిన వారంతా.. దర్శకుడిపై, హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (BlockBuster Bhagavanth Kesari)
నిజంగా బాలయ్య ఇలాంటి సినిమా చేయడానికి అంగీకరించినందుకు.. దర్శకుడు కూడా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది’ అని అనిల్ రావిపూడి మొదటి నుంచి చెబుతుంది అందుకే. ఆయన చెప్పినట్లే ఈ సినిమా గురించి ముందు ముందు ఇంకా బాగా వినబడుతుంది. టాకే కాదు.. కలెక్షన్స్ కూడా రోజు రోజుకీ పెరుగుతుండటం చూస్తుంటే.. దసరా విన్నర్‌గా బాలయ్య (Balayya) నిలిచినట్లే. ఈ సినిమా రెండు రోజులకుగానూ ప్రపంచవ్యాప్తంగా రూ. 52.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మూడో రోజు పబ్లిక్ డిమాండ్ విపరీతంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు స్క్రీన్స్ పెంచుతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. (Bhagavanth Kesari Collections)