కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pooja Jhaveri: విజయ్ దేవరకొండ హీరోయిన్ పెళ్లి చేసుకుంది, ఎవరితో అంటే...

ABN, First Publish Date - 2023-12-15T15:53:51+05:30

విజయ్ దేవరుకొండ సినిమా 'ద్వారకా' లో నటించిన పూజ జవేరి వివాహం చేసుకుంది. శ్రీలంకలో జరిగిన ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు అందరూ విచ్చేశారని ఆమె సాంఘీక మాధ్యమం ద్వారా తెలిపింది.

Pooja Jhaveri ties the knot

వరుణ్ తేజ్ (VarunTej), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi)ల వివాహం ఆమధ్య జరిగింది, ఈమధ్యనే దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం వివాహం శ్రీలంకలో జరిగింది. ఇప్పుడు ఇంకొక కథానాయకురాలి వివాహం చేసుకుంది. 'భం బోలేనాథ్' అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన గుజరాతి అమ్మాయి పూజ జవేరి (Pooja Jhaveri ties the knot) పెళ్లి చేసుకుంది. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) 'ద్వారక' అనే సినిమా కూడా చేసింది, అల్లరి నరేష్ తో కూడా 'బంగారు బుల్లోడు' అనే సినిమాలో నటించింది.

ఆ తరువాత ఒకటి రెండు తెలుగు సినిమాలు చేసిన పూజ జవేరి అంతగా వెలుగులోకి రాలేదు. గుజరాతి సినిమాలు చేస్తూ, సాంఘీక మాధ్యమంలో మాత్రం ఎప్పటికప్పుడు తన గురించి వార్తలు పెడుతూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈమె వివాహానికి సంభందించిన ఫోటోలని ఆమె ఇన్స్టా గ్రాములో షేర్ చేసింది. గుజరాతి సినిమాలో గుర్తింపు తెచ్చుకున్న పూజా జవేరి తన బాయ్ ఫ్రెండ్ ఇషాన్ సాంగ్విని పెళ్లి చేసుకుంది.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ ఈ వివాహానికి హాజరయి ఆమెకి శుభాకాంక్షురాలు తెలిపినట్టుగా ఆమె పోస్ట్ చూస్తే తెలుస్తోంది. అలాగే తమ జంటని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఈ సాంఘీక మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. గుజరాతి అమ్మాయి అయినా పూజ జవేరి 2015లో 'భం బోలేనాధ్' సినిమాతో తెలుగులోకి ఎంటర్ అయింది. తెలుగులో చాలా సినిమాలు చేసినా మంచి బ్రేక్ మాత్రం రాలేదు ఆమెకి. ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలు కూడా చేసింది.

Updated Date - 2023-12-15T15:53:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!