Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం
ABN , First Publish Date - 2023-08-23T20:16:32+05:30 IST
130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ.. చంద్రయాన్ 3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టమని అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ప్రయోగం సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ.. చంద్రయాన్ 3 (Chandrayaan-3)లో భాగమైన విక్రమ్ లాండర్ (Vikram Lander) చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టమని అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో.. చంద్రుడి ఉపరితలం తాకిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతేకాదు.. చంద్రుడి దక్షిణ ధృవంలో ఈ రోవర్ ల్యాండ్ అవ్వడంతో.. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఈ ప్రయోగానికి సహకరించిన బిజెపి ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు.
‘‘ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ.. చంద్రయాన్ 3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టం. ఇంతటి విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలు సర్వదా అభినందనీయులు. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)గారికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి (BJP Government) నా హృదయపూర్వక అభినందనలు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్‌ను అడుగు పెట్టించి, దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన తొలి దేశంగా మనల్ని సగర్వంగా నిలిపారు. చంద్రయాన్ 3 సాధించిన ఈ విజయంతో అంతరిక్ష రంగాన భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ చంద్రయాన్ 3 మిషన్ సంపూర్ణంగా విజయం సాధించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
***************************************
*Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు
***************************************
*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?
***************************************
*800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..
***************************************