Niharika Konidela: ముద్దపప్పు ఆవకాయ చేసిన నిహారిక, ఇప్పుడేంటి ఇంత బోల్డ్ గా మాట్లాడుతోంది

ABN , First Publish Date - 2023-06-08T14:14:21+05:30 IST

నిహారిక కొణిదెల పేరు సాంఘీక మాధ్యమాల్లో మళ్ళీ వైరల్ అవుతోంది. ఆమె నటించిన 'డెడ్ పిక్సల్స్' వెబ్ సిరీస్ లో ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా బోల్డ్ గా వున్నాయి. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ తెర మీదకి వచ్చిన నిహారికలో పెద్ద మార్పు కనపడుతోంది. ఆ మార్పు విడాకులు తీసుకోవటం వలన వచ్చిందేనా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

Niharika Konidela: ముద్దపప్పు ఆవకాయ చేసిన నిహారిక, ఇప్పుడేంటి ఇంత బోల్డ్ గా మాట్లాడుతోంది
Niharika Konidela

మెగా కుటుంబం #Mega Family నుండి వచ్చిన మహిళల్లో ఇప్పుడు నిహారిక కొణిదెల (NiharikaKonidela) పేరు మారుమోగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు (NagababuKonidela) కుమార్తె అయిన నిహారిక వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సల్స్' (DeadPixels) చేసింది. అందులో ఆమె పాత్ర పేరు గాయత్రి, ఒక గేమర్ ఆమె. ఒకప్పుడు నిహారిక వాడుక తెలుగు భాష మాట్లాడుకునేంత అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే 'ముద్దపప్పు ఆవకాయ' (Muddapappu Avakai) లాంటి వెబ్ సిరీస్ లోనూ, సూర్యకాంతం (Suryakantham) లాంటి సినిమా పాత్రలోనూ కనిపించేది. చాలా ఒద్దికగా, తెలుగు అమ్మాయిలా కనిపించే నిహారికకు వివాహం అయ్యాక వీటన్నిటికీ దూరం అయిందనే చెప్పాలి.

niharikak2.jpg

అయితే ఈమధ్య నిహారిక మళ్ళీ విజృభించింది. ఈసారి తెలుగు భాషలా కాకుండా, కొంచెం ఆంగ్ల బాష లా మారింది. అంటే తాను కేవలం 'ముద్దపప్పు ఆవకాయ' లాంటి వెబ్ సిరీస్ లే కాదు, చాల బోల్డ్ గా వుండే పాత్రలో, మాటలు కూడా అలాగే వుండేట్టుగా ఉన్నదాంట్లో నటించగలను అని చెప్పింది. అదే 'డెడ్ పిక్సల్స్' వెబ్ సిరీస్. ఇందులో నిహారిక చాలా బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. ఆమె ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తూ, ఇందులో చెప్పేలాంటి బోల్డ్ డైలాగ్స్ మొదటిసారిగా చెప్పడం.

అయితే కొంతమంది మెగా అభిమానులకు ఆమె డైలాగ్స్, ఆమె పాత్ర నచ్చటం లేదేమో కానీ, ఇలా నిహారిక బోల్డ్ గా రావటం మెగా కుటుంబంలో మొదటి మహిళ అని చెప్పొచ్చు. చిరంజీవి కుమార్తెలు సుష్మిత ప్రొడక్షన్ లో కి వచ్చి, వెబ్ సిరీస్, సినిమాలు తీస్తున్నారు, కానీ నిహారిక ఒక పక్క ప్రొడక్షన్, ఇంకో పక్క నటిస్తూ మళ్ళీ బిజీ అవ్వాలని అనుకుంటోంది. అయితే ఇలా బోల్డ్ గా ఒక పాత్ర చెయ్యడం మాత్రం మొదటిసారి. అందువలనే ఆమె సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

niharikak.jpg

అయితే ఆమె ఎందుకు ఒక్కసారిగా ఇలాంటి పాత్రలు చెయ్యాలని నిర్ణయం తీసుకుందో తెలియదు అని అంటున్నారు. ఆమధ్య ఆమె విడాకుల మీద కూడా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె, ఆమె కుటుంబం నుండీ విడాకుల గురించి మాట్లాడలేకపోయినా, ఆమె విడాకులు తీసుకుంది అని ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో పోషించిన గాయత్రీ పాత్ర చెప్పకనే చెప్పింది. ఆమె డైలాగ్స్ కూడా తన పక్క పాత్రతో కాకుండా, ఎవరికో ఎక్కడో సమాధానం చెపుతున్నట్టుగా వుంది. సాంఘీక మాధ్యమాల్లో కూడా చాలా చురుకుగా వుంది. ముందు ముందు మంచి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎలా అలరిస్తోందో చూడాలి మరి !

Updated Date - 2023-06-08T14:14:21+05:30 IST