Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

ABN , First Publish Date - 2023-08-09T16:42:51+05:30 IST

మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు మెగా బ్రదర్ నాగబాబు. మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తున్న వారందరికీ సోషల్ మీడియా వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చారు.

Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?
Mega Brother Nagababu

మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu). కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీని వైసీపీ మంత్రులు (YCP Ministers) ఎలా టార్గెట్ చేశారో తెలియంది కాదు. ‘బ్రో’ (Bro) విషయంలోనే కాకుండా.. రాజ్యసభలో సైతం హీరోల రెమ్యూనరేషన్‌పై వైసీపీకి చెందిన ఓ ఎం.పీ. మాట్లాడటాన్ని.. తిప్పికొడుతూ.. చిరంజీవి (Chiranjeevi) చిన్న క్లాస్ ఇచ్చారు. ఆయన చెప్పిన దానిలో ఎవరినీ హర్ట్ చేసే పదాలు కూడా ఏం లేవు. ప్రజల అవసరాలపై దృష్టిపెట్టండి.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారని మాత్రమే చెప్పారు. దీనికి ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులని విమర్శించినట్లుగా భావిస్తూ.. మెగాస్టార్‌ని ట్రోల్ చేస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా నాగబాబు (Nagababu) ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.


Nagababu-Pic.jpg

(Nagababu Twitter Post)

‘‘శ్రమని పెట్టుబడిగా పెట్టి,

పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి,

వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి,

24 క్రాఫ్ట్‌లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ..

ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు..

నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు, ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడ ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు,

ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది..

మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నార..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది..

NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది...

ఆరోగ్యాలు జాగ్రత్త.!’’ అని మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్‌పై వైసీపీ మంత్రులు, అభిమానులు చేస్తున్న కామెంట్స్‌కి కౌంటర్ వేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

***************************************

*Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

***************************************

*Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

***************************************

Updated Date - 2023-08-09T16:42:51+05:30 IST