Megastar Chiranjeevi: అలా క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకున్నా.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన మెగాస్టార్!
ABN , First Publish Date - 2023-06-03T18:37:51+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటిసారి తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కూడా క్యాన్సర్ (Cancer) బారిన పడేవాడినని, కానీ ముందస్తు చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగానని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటిసారి తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కూడా క్యాన్సర్ (Cancer) బారిన పడేవాడినని, కానీ ముందస్తు చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగానని తెలిపారు. తాజాగా ఆయన హైదరాబాద్, నానక్ రామ్ గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్‌కు హాజరయ్యారు. ఓపెనింగ్ అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని టెస్ట్‌లు చేయించుకునే క్రమంలో.. నా బాడీలో కొన్ని పాలిప్స్‌ను డాక్టర్స్ గుర్తించి తీసేశారు. దానితో నేను క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోగలిగాను అని తెలిపారు.
‘‘క్యాన్సర్‌పై అవగాహన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. నేనెప్పుడూ అనుకునే వాడిని. మంచి ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటూ ఉంటాను. నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఎటువంటి జబ్బులు రావు అని అనుకోవడానికి లేదు. కొన్నాళ్ల క్రితం.. నార్మల్ చెకప్ అని ఏఐజీలో కొలనో స్కోపీ చేయించుకోవడానికి వెళ్లాను. అప్పుడు కొన్ని పాలిప్స్ (non - cancerous polyps) ఉన్నట్లుగా డాక్టర్స్ గుర్తించారు. మీరు చాలా ఎర్లీగా వచ్చారు.. అవి ముదిరితే మాత్రం క్యాన్సర్ బారిన పడేవారని తెలుపుతూ వాటిని తీసేశారు. ఈ అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం అని ఈ విషయం మొట్టమొదటిసారి నేను చెబుతున్నాను..’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. నేను ముందుస్తు చికిత్స తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోగలిగాను. ఈ విషయం చెప్పడానికి నేను భయపడటం లేదు. క్యాన్సర్‌పై నిర్లక్ష్యం చేస్తే మాత్రం చావుని కొనితెచ్చుకున్నట్లే. చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోగలిగితే మాత్రం.. ఖచ్చితంగా క్యాన్సర్‌ని నివారించుకోవచ్చు. ఇటీవల ఓ పాప తన చివరి కోరిక అని చిరంజీవిని చూడాలని అంటే నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇది చివరి కోరిక అనుకోవద్దు.. మొదటి కోరిక అనుకో అని చెప్పాను. ఆ పాప ఇప్పుడు చక్కగా ఉంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించారు కాబట్టి. అలాగే పెడన నుంచి ఇంకొక అతను అలాగే వచ్చాడు. అతనికి చికిత్స చేయించాం కానీ.. అతనికి చివరి స్టేజ్ అని తెలిసింది. అతను దురదృష్టవశాత్తూ దూరమయ్యాడు.
నా అభిమానులకి, సినీ కార్మికులకు భరోసా ఇచ్చేలా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్కీనింగ్ టెస్ట్‌లు చేయించడానికి నా వంతు సహకారాన్ని అందిస్తాను. హైదరాబాద్‌లోనే కాదు.. ప్రతి జిల్లాల్లోనూ ఈ క్యాన్సర్ స్కీనింగ్ టెస్ట్‌లు జరిపితే.. అందుకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. ఎన్ని కోట్ల రూపాయలు అయినా సరే.. భగవంతుడు నాకు కలిగించాడు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలి.. అని చిరంజీవి ఈ కార్యక్రమంలో కోరారు. దీనికి స్టార్ క్యాన్సర్ సెంటర్ వారు కూడా తమ సహకారం అందిస్తామని చిరంజీవికి మాటిచ్చారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా?
*Varun-Lavanya: కొడుకు పెళ్లి వార్తలపై నాగబాబు అలా!.. సోషల్ మీడియాలో వరుణ్ ఇలా!
*PedaKapu1: ‘పెదకాపు1’.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి డైరెక్ట్ అటాక్
*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!
*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..