Chiranjeevi and Suman: ఇప్పుడేమంటారు మాస్టారూ..

ABN , First Publish Date - 2023-02-15T19:55:52+05:30 IST

హీరో సుమన్ సినీ కెరీర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అప్పట్లో ఏదో చేశారంటూ ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే

Chiranjeevi and Suman: ఇప్పుడేమంటారు మాస్టారూ..
Chiranjeevi and Suman

హీరో సుమన్ సినీ కెరీర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అప్పట్లో ఏదో చేశారంటూ ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను సుమన్ (Suman) కూడా సీరియస్‌గా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్‌గా ఈ విషయంపై స్పందించి.. ఆ వార్తలను కొట్టిపారేశారు. అలాంటి నేచర్ తనది కాదని వివరణ కూడా ఇచ్చారు. దీంతో రూమర్స్‌కి బ్రేక్ పడింది. అయినా మెగాస్టార్ చిరంజీవి మనసేంటో అందరికీ తెలిసిందే. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా.. ఎవరి సినిమా అయినా సరే.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే.. ముందు ఆయన సంబరపడిపోతారు. వెంటనే ఆ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. అభినందిస్తుంటారు. అలాంటి చిరంజీవి.. ఒకరి కెరీర్‌పై దెబ్బ కొట్టారంటే.. అసలు నమ్మే విషయమేనా?. ఇప్పుడు కూడా సుమన్ సినీ కెరీర్ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ వీడియోని విడుదల చేశారు. అందులో

“మై డియర్ బ్రదర్ సుమన్.. మీరు ఫిలిం ఇండస్ట్రీలో 45 ఏళ్ళ కెరీర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నటుడిగా దాదాపు 10కి పైగా భాషలలో సినిమాలు చేయడం అద్భుతమైన విషయం. నిజంగా ఇది చాలా గొప్ప అచీవ్‌మెంట్‌గా నేను భావిస్తున్నాను. 45 ఏళ్ళ మీ సినీ ప్రయాణం.. మీ కమిట్‌మెంట్, డెడికేషన్‌కి నిదర్శనం. ఇంత గొప్ప అచీవ్ మెంట్ సాధించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులకు వినోదం పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫిబ్రవరి 16న మంగళూరులో మీ 45 ఏళ్ళ కెరీర్ ని పురస్కరించుకొని జరగనున్న వేడుక కూడా సక్సెస్ కావాలని కోరుతున్నాను..’’ అని సుమన్‌కు మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు. (Megastar Greetings to Suman)

ఇది చిరంజీవి అంటే. ఎదుటి వారి విజయాన్ని కూడా తన విజయంగా ఆయన మురిసిపోతుంటారు. అలాంటి మనసు మెగాస్టార్‌ది. సుమన్ కూడా.. తన రీ ఎంట్రీలో చిరంజీవి సినిమాలలో నటించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పుడీ వీడియోతో అది మరోసారి స్పష్టమైంది.

Updated Date - 2023-02-15T19:55:53+05:30 IST