MAA is back: మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు రెండేళ్ల పనితీరు సున్నా: ప్రకాష్ రాజ్

ABN , First Publish Date - 2023-11-14T11:25:28+05:30 IST

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావస్తోంది. మళ్ళీ మా ఎన్నికలు జరిగే సమయం కూడా ఆసన్నమైంది. ఈ సమయంలో గతంలో మా అధ్యక్షకుడిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

MAA is back: మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు రెండేళ్ల పనితీరు సున్నా: ప్రకాష్ రాజ్
Prakash Raj and Manchu Vishnu

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (MovieArtisteAssocation)(మా) (MAA) మళ్ళీ వార్తల్లో వుంది. రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు (ManchuVishnu), ప్రకాష్ రాజ్ (PrakashRaj) మధ్య హోరా హోరీ గా పోటీ సాగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నటులు అప్పట్లో ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లారు, అంటే మా అధ్యక్షుడి పదవి ఈ ఇద్దరికీ ఎంత ప్రాముఖ్యమో అర్థం అవుతోంది కదా. ప్రకాష్ రాజ్ ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా కుటుంబ (MegaFamily) సభ్యులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రకాష్ రాజ్ సునాయాసంగా గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ, మంచు విష్ణు ఆశ్చర్యంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.

prakashraj-trouble.jpg

అప్పుడు మా బిల్డింగ్ ఒకటి ముఖ్యమైన ప్రాతిపదికగా వుండింది, మంచు విష్ణు తను ఎన్నికైన వెంటనే సొంత భవనం నిర్మాణానికి కృషి చేస్తాను అని అన్నాడు కూడా. మంచు విష్ణు ఎన్నికై రెండేళ్లు కావొస్తోంది, ఇప్పుడు మళ్ళీ మా కి ఎన్నికలు కూడా వచ్చేస్తాయి, అయితే ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "రెండేళ్లు అయిపోయాయి, కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు, అలాగే మా కి సొంత భవనం కూడా లేదు, మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా," అని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.

Vishnu.jpg

కొందరు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలని, అతను ఈ రెండేళ్లలో ఏమి చేసాడో చెప్పాలని, కనీసం మీటింగ్ కూడా పెట్టలేకపోయాడని చెప్పారు ప్రకాష్ రాజ్. బోగస్ ఓట్లు, అలాగే బయట నుండి చాలామంది వచ్చి ఓటెయ్యడంలాంటివి చెయ్యడం వలన అతను గెలిచాడని, కానీ ఈ రెండేళ్లలో అతని పనితీరు సున్నా అని చెప్పారు ప్రకాష్ రాజ్. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో చెయ్యనో తెలియదని, ఎందుకంటే జాతీయ అంశాలపై తన దృష్టి ఉందని, ఇవన్నిటికీ తోడు చాలా బిజీ షెడ్యూల్ ఉందని అందుకని పోటీ చెయ్యకపోవచ్చు అని చిన్న హిట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం మంచు విష్ణు 'కన్నప్ప' #Kannappa సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది.

Updated Date - 2023-11-14T11:25:29+05:30 IST