Mahesh Babu: రేవంత్ రెడ్డి గారు.. మీ నాయకత్వంలో తెలంగాణ‌ అభివృద్ధి చెందాలి: మ‌హేశ్ బాబు

ABN , First Publish Date - 2023-12-08T23:21:33+05:30 IST

తెలంగాణ రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఒక‌ రోజు ఆల‌స్యంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Mahesh Babu: రేవంత్ రెడ్డి గారు.. మీ నాయకత్వంలో తెలంగాణ‌ అభివృద్ధి చెందాలి: మ‌హేశ్ బాబు
REVANTH MAHESHBABU

తెలంగాణ (Telangana) రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (RevanthReddy)కి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (urstruly Mahesh) ఒక‌రోజు ఆల‌స్యంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ‌ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆయితే ఆయ‌న గుంటూరు కారం షూటింగ్‌లో వేరే రాష్ట్రంలో బిజీగా ఉండ‌డం వ‌ల‌న నిన్న శుభాకాంక్ష‌లు తెల‌ప‌లేక పోయినట్టు తెలస్తోంది. ఈ రోజు స‌మ‌యం ల‌భించ‌డంతో ఆలస్యంగానైనా శుభాకాంక్షలు తెలిపార‌ని అభిమానులు అనుకుంటున్నారు.


అయితే.. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌వ‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర వేగంగా జ‌రుగుతున్నది. జ‌న‌వ‌రి 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా త‌మ‌న్ సంగీతంలో ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా అవి బాగా హిట్ అయి సినిమాపై అంచ‌నాలు పెంచాయి.

Updated Date - 2023-12-08T23:26:01+05:30 IST