Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-20T22:50:30+05:30 IST
శుక్రవారం విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాని వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. రామయాణాన్ని తప్పుగా చూపించారంటూ చాలా చోట్ల సినిమాపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటి మాధవీలత కూడా సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్‌పై ఫైరయింది. ఇందులో ఓంరౌత్‌ది మాత్రమే కాకుండా.. ప్రభాస్‌ది కూడా 50 శాతం తప్పు ఉన్నట్లుగా ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా గత శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడంతో.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల పరంగా కాస్త ఓకే అనిపించుకుంది కానీ.. లేదంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసేది. అందుకు సాక్ష్యం సోమవారం నుంచి ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లే. కలెక్షన్స్ సంగతి అలా ఉంటే.. ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్, వివాదాలకు అంతే లేకుండా పోయింది. సినిమాని బ్యాన్ చేయాలంటూ.. ప్రధాని వరకు వినతి పత్రాలు వెళుతున్నాయంటే.. ఏ రేంజ్‌లో సినిమాపై వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమాపై.. ముఖ్యంగా ప్రభాస్‌పై నటి మాధవీలత (Madhavi Latha) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
‘‘ఆదిపురుష్ మ్యాటర్‌లో అందరూ డైరెక్టర్‌ని దొబ్బుతున్నారు. హీరో మ్యాటర్‌లో సైలెంట్ అయ్యారు. హీరోకి బాధ్యత లేదా? స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు తెలియలేదా.. తనేమన్నా న్యూ హీరోనా? డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడానికి? అయినా హీరో చెప్పినట్లే కదా.. డైరెక్టర్స్ వింటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి. ఇందులో హీరో తప్పు 50 శాతం ఉంది. ఏం రామాయణంపై సినిమా చేసేటప్పుడు రామాయణం గురించి తెలుసుకోరా? నిష్ట లేదా? బాధ్యత లేదా?’’ అంటూ మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఫైరయ్యింది. (Madhavi Latha on Adipurush)
ఆమె పెట్టిన ఈ పోస్ట్‌కు కొందరు నెటిజన్లు ఆమెతో పాటు వంత పాడుతుంటే.. మరికొందరు మాత్రం మాధవీలతను తిట్టిపోస్తున్నారు. వాస్తవానికి సినిమా విడుదలైన తర్వాత కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో.. మేకర్స్ కూడా ఇందులో డైలాగ్స్‌ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. డైలాగ్స్ మార్చినా.. ‘రామాయణం’ (Ramayan)ను తప్పుగా చూపించారనే పేరు ఎలాగూ పోదు. వాళ్లు తప్పు చేశారని ఫీల్ అవుతున్నారు కాబట్టేగా.. ఇప్పుడు మారుస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. అదేదో తీసేటప్పుడో చేయవచ్చు కదా.. అంటూ కొందరు మాధవీలతలా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్ సీన్.. రచ్చ రచ్చ అవుతోంది
**************************************
*Chiranjeevi: పాప పుట్టిన ఘడియలు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది
**************************************
*Heroines: పెళ్లి ముహూర్తానికి వేళాయెరా..
**************************************
*Rakesh Master: గురువు రాకేశ్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన శిష్యులు
**************************************