IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?
ABN , First Publish Date - 2023-04-25T19:55:59+05:30 IST
ఆ కోణంలో ఐటీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు కానీ.. మైత్రీ సంస్థలోకి సుమారు రూ. 700 కోట్ల విదేశీ పెట్టుబడులు..
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ఆఫీస్‌లపై దాదాపు 5 రోజులు (ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు) పాటు.. ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో మైత్రీ పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టినట్లుగా తాజాగా వార్తలు బయటికి వస్తున్నాయి. ముందు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వెనుక ఏపీ, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉన్నారని జనసేన నేత చేసిన ఆరోపణల దృష్ట్యా ఈ ఐటీ రైడ్స్ జరిగినట్లుగా టాక్ నడిచింది. అయితే ఆ కోణంలో ఐటీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు కానీ.. మైత్రీ సంస్థలోకి సుమారు రూ. 700 కోట్ల విదేశీ పెట్టుబడులు (Foreign Investments) వచ్చినట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి ఆ విదేశీ పెట్టుబడులు బదిలీ అయినట్లుగానూ, ఆ తర్వాత ఏడు కంపెనీలకు వాటిని తరలించినట్లుగా ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆ విధంగానే మైత్రీకి కూడా పెట్టుబడుల రూపంలో అమౌంట్ వచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ అమౌంట్‌ని హవాలా ద్వారా మైత్రీ సంస్థ.. బాలీవుడ్ దర్శకుడికి రూ. 150 కోట్లు చెల్లించిందని, అలాగే మైత్రీ సంస్థలో ప్రస్తుతం ఓ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్ర హీరోకు సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ జరిగినట్లుగా ఐటీ అధికారుల (IT Officials) సోదాలో తెలిసినట్లుగా సమాచారం.
వీరే కాకుండా.. గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిగాయని గుర్తించిన ఐటీ అధికారులు.. ఇప్పటికే హీరోల ఖాతాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిశీలనలో కనుక అది నిజమని తెలిస్తే మాత్రం.. ఆయా హీరోలను ముంబైకి పిలిచి విచారణ జరిపే అవకాశం ఉందనేలా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సోదాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
************************************************
*Amala Paul: కథ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు
*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..
*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?
*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?
*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్
*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య