Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

ABN , First Publish Date - 2023-08-11T11:38:09+05:30 IST

విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో సేమ్ టైమ్‌లో విడుదలవుతుంటాయి. తెలుగువాడైనా.. కోలీవుడ్‌లో బిజీ హీరోగా పేరు పొందిన విశాల్‌పై పెళ్లి విషయంలో ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన హీరోయిన్ లక్ష్మీ మీనన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆ వార్తలు నిజం కావని క్లారిటీ ఇచ్చారు.

Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..
Hero Vishal

విశాల్ (Vishal) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో సేమ్ టైమ్‌లో విడుదలవుతుంటాయి. తెలుగువాడైనా.. కోలీవుడ్‌ (Kollywood)లో బిజీ హీరోగా పేరు పొందిన విశాల్‌పై పెళ్లి విషయంలో ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) విషయంలో విశాల్ ప్రేమాయణం ఏమయిందో అందరికీ తెలిసిందే. తర్వాత ఏం లేదనేలా.. ఎవరి దారి వారిదే అనేలా విడిపోయి.. సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్‌తో ప్రేమ కాదు.. ఏకంగా పెళ్లే అయిపోయిందనేలా వార్తలు వైరల్ అవుతుండటంతో.. విశాల్ వివరణ ఇవ్వక తప్పలేదు.


ముందు విశాల్ పీఆర్ టీమ్ వివరణ ఇచ్చినా.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌ (Lakshmi Menon)తో విశాల్ పెళ్లి జరిగిపోయిందనే వార్తలు ఆగలేదు. దీంతో విశాల్ దిగిరాక తప్పలేదు. తాజాగా విశాల్ ఈ వైరల్ అవుతున్న వార్తలపై స్పందిస్తూ... “మాములుగా నేను నా గురించి వ‌చ్చే ఫేక్ న్యూస్ లేదా రూమ‌ర్స్‌కి స‌మాధానం చెప్పను. నా దృష్టిలో వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తాను. కానీ ఇప్పుడు లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి గురించి వ‌స్తున్న వార్తల‌పై మాట్లాడాల్సి వస్తుంది. ఇది పూర్తిగా అబ‌ద్ధం.. అందులో ఎటువంటి నిజం లేదు’’ అని విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఈ రూమర్‌పై స్పందించడానికి కారణం చెబుతూ..

‘‘దీనిపై స్పందించడానికి కార‌ణం ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విష‌యం కాబట్టే నేను రియాక్ట్ అవ్వాలి వచ్చింది. ఆమె న‌టి అనేది ప‌క్క‌న పెడితే.. మీరు ఇలాంటి వార్తలతో ఒక అమ్మాయి జీవితంలోకి చొరబడుతున్నారు. ఆమె పేరుని నాశ‌నం చేస్తున్నారు. నేను ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకుంటానో తెలుసుకోవడం బెర్ముడా ట్రయాంగిల్ అంతా కష్టమేమీ కాదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నేను అధికారికంగా తెలియజేస్తాను.. కాస్త ఓపిక పట్టండి” అంటూ విశాల్ ట్విట్టర్ వేదికగా రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారికి క్లాస్ ఇస్తూ.. అసలు విషయం చెప్పేశారు. (Vishal Clarity about Marriage Rumours)


ఇవి కూడా చదవండి:

***************************************

*Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..

***************************************

*OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

***************************************

*Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

***************************************

*Raiza Wilson: వీధి పిల్లి దాడిలో హీరోయిన్‌కు గాయాలు

***************************************

Updated Date - 2023-08-11T11:38:09+05:30 IST