Shruti Haasan: శ్రీలీల కాదు.. ఈ సంవత్సరం శృతిహసన్‌దే
ABN , Publish Date - Dec 22 , 2023 | 07:32 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా కలిసొచ్చిందా అంటే అది శృతిహాసన్‌కు మాత్రమే అని బల్లగుద్ది మరి చెప్పొచ్చు. ఈ యేడు ప్రారంభమే బాలకృష్ఱ, చిరంజీవి సినిమాలతో పలకరించిన ఈ అమ్మడు మళ్లీ నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న, ప్రభాస్ సలార్ సినిమాలలోనూ నటించి ఈ ఏడాదికి గ్రాండ్‌గా ముగింపు పలికింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా కలిసొచ్చిందా అంటే అది శృతిహాసన్‌కు మాత్రమే అని బల్లగుద్ది మరి చెప్పొచ్చు. ఈ యేడు ప్రారంభమే బాలకృష్ఱ, చిరంజీవి సినిమాలతో పలకరించిన ఈ అమ్మడు మళ్లీ నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న, ప్రభాస్ సలార్ (Salaar) సినిమాలలోనూ నటించి ఈ ఏడాదికి గ్రాండ్‌గా ముగింపు పలికింది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరోటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి శృతి (Shruti Haasan) కేరీర్‌లోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి బెస్ట్ ఇయర్‌గా రికార్డులోకెక్కింది.
సినిమాల్లోకి వచ్చి పుష్కరం పూర్తి చేసుకున్న శృతి కేరీర్ మంచి జెట్ స్పీడులో ఉన్న దశలోనే లవ్, హెల్త్ సమస్యలంటూ వచ్చిన, వస్తున్న ఆఫర్లను వదులుకుని ఇండస్ట్రీకి మూడు, నాలుగేండ్లు దూరమైంది. మధ్యలో శ్రీలీల (Sreeleela) ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టడంతో రష్మిక, పూజా హెగ్డే, కృతిశెట్టిలకు తెలుగునాట సినిమాలు ఛాన్స్‌లు సైతం తగ్గిపోగా, ఇక శృతి (Shruti Haasan) ఇండస్ట్రీకి దూరమైనట్టే అని అంతా భావించారు. కానీ రవితేజ, మలినేని గోపిచంద్‌లతో రెండోసారి కలిసి చేసిన ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వడంతో మరోసారి శృతి కెరీర్ గాడిలో పడింది.
ఈ క్రమంలోనే సినిమాలపై దృష్టి పెట్టిన అమ్మడు సైలెంట్‌గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సలార్‌కు ఆ తర్వాత బాలకృష్ణతో వీర సింహారెడ్డి (Veera Simha Reddy), చిరంజీవితో వాల్తేరు వీరయ్య (WaltairVeeraiah) చిత్రాలకు సైన్ చేయడంతో పాటు నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న చిత్రంలో ఓ గెస్ట్ రోల్ కూడా చేసింది. ఈ సినిమాలన్నీ ఈ యేడాదే విడుదలై శృతిహసన్ (Shruti Haasan)కు చిరస్మరణీయ భారీ విజయాలను అందించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా నెంబర్‌వన్ ప్లేస్‌ను సుస్థిరం చేసి పెట్టాయి.
ఈ యేడాది శ్రీలీల (Sreeleela) స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్ట్రా ఆర్డీనరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అందులో ఒక్క భగవంత్ కేసరి చిత్రం మాత్రమే హిట్‌గా నిలిచింది. ఇక రష్మిక (Rashmika Mandanna) వారిసు అనే తమిళ చిత్రం, మిషన్ మజ్ను, యానిమల్ అనే రెండు హిందీ సినిమాలలో నటించగా ఒక్క తెలుగు స్ట్రెయిట్ చిత్రం కూడా చేయలేదు.
పూజా హెగ్డే (Pooja Hegde) సల్మాన్‌ఖాన్ కిసికా భాయ్ కిసికా జాన్ అనే ఒక్క హిందీ చిత్రంలో మాత్రమే నటించింది. ఈ లెక్కన చూస్తే శృతిహసన్ (Shruti Haasan) ఈ సంవత్సరం నటించిన నాలుగు చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఏడాది చివరలో వచ్చిన సలార్ బాక్సాపీస్ వద్ద దుమ్ము లేపుతుండడంతో శ శృతిహసన్ ది గోల్డెన్ హ్డ్యాండ్, గోల్డెన్ లెగ్ అంటూ ప్రభాస్ అభిమానులు శృతిహసన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.