సెట్లో ముచ్చట్లు అప్పుడలా... మరి ఇప్పుడు!

ABN , First Publish Date - 2023-10-02T12:42:55+05:30 IST

ఒకప్పుడు సినిమా సెట్‌ అంటే భలే సందడి వాతావరణం ఉండేదని సీనియర్‌ ఆర్టిస్ట్‌లు చెబుతుంటారు. షాట్‌ గ్యాప్‌లో సరదాగా మాట్లాడుకోవడం, మంచి చెడ్డలను పంచుకోవడం, లంచ బ్రేక్‌లో కలిసి భోజనం చేయడం, ఎవరి భోజనం వారే తినకుండా నలుగురు కలిసి పంచుకుని తింటుండటం జరుగుతుండేది

సెట్లో ముచ్చట్లు అప్పుడలా... మరి ఇప్పుడు!

ఒకప్పుడు సినిమా సెట్‌ అంటే భలే సందడి వాతావరణం (Shooting set) ఉండేదని సీనియర్‌ ఆర్టిస్ట్‌లు చెబుతుంటారు. షాట్‌ గ్యాప్‌లో సరదాగా మాట్లాడుకోవడం, మంచి చెడ్డలను పంచుకోవడం, లంచ్ బ్రేక్‌లో కలిసి భోజనం చేయడం, ఎవరి భోజనం వారే తినకుండా నలుగురు కలిసి పంచుకుని తింటుండటం జరుగుతుండేది. క్యారావ్యాన అందుబాటులో లేని రోజుల్లో సెట్‌లో, లేదా చెట్ల కింద కూర్చుకి ఆర్టిస్ట్‌లుచ టెక్నీషియన్లు సరదాగా కూర్చుని సంభాషించుకుంటేవారు. అయితే ఇప్పుడు అలాంటి సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి. నేటితరం తారలు ఎవరి వ్యానిటీ వ్యాన్ లో వారే ఉంటారు. ఇంటి నుంచి వచ్చినా ప్రొడక్షన నుంచి వచ్చినా అందులోనే కూర్చుని తినే వరవడి వచ్చేసింది. సరదాగా నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ తినే సంస్కృతి ఎక్కడో గానీ కనిపించడం లేదు.

Kota.gif

ఈ విషయంలో పాతతరం తారలు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఈతరం నటీనటుల్లో ఎక్కువ శాతం మందికి పాతవాళ్లు ఎవరెవరో కూడా తెలియదని, సరదాగా మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉండదని ఇంటర్వ్యూలో చెబుతుంటారు. ఆ రోజులే మంచివని అంటుంటారు. అయితే తాజాగా ఓ పొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ సినిమా సెట్‌లో కోట శ్రీనివాసరావు(Kota Srinvasarao), ఏవిఎస్‌(AVS), అలీ(Ali), గుండు హనుమంతరావు సరదాగా భోజనం చేస్తున్న దృశ్యమది. అందులో అలీ ఎంతో ఆప్యాయంగా కోటకు వడ్డిస్తున్న విజువల్‌ భలే ముచ్చటగా ఉంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆ రోజులే బావున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.

మరి ఇప్పుడైతే ఎక్కడో కానీ ఇలాంటి సరదా సన్నివేశాలు కనిపించవు. చిరంజీవిలాంటి సీనియర్‌ నటులు ఉండే సెట్స్‌లో మాత్రమే మాటామంతీ, సరదా ముచ్చట్లు, కలిసి భోజనాలు చేయడం లాంటివి కనిపిస్తుంటాయి.

Updated Date - 2023-10-02T12:42:55+05:30 IST