DeepVeer: దీపిక, రణ్‌వీర్ విడాకులు తీసుకుంటున్నారా?.. ఆ వైరల్ వీడియో చూసి షాక్‌లో ఫ్యాన్స్
ABN , First Publish Date - 2023-03-24T14:33:57+05:30 IST
ప్రేమపెళ్లిలు చేసుకోవడం, ప్రేమ ఉన్నన్ని రోజులు కలిసుండడం, ఆ తర్వాత విడిపోవడం..
ప్రేమపెళ్లిలు చేసుకోవడం, ప్రేమ ఉన్నన్ని రోజులు కలిసుండడం, ఆ తర్వాత విడిపోవడం.. బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో మామూలే. ఎంతోమంది స్టార్స్ అలా విడిపోయారు. తాజాగా మరో జంట ఆ విడాకుల బాటపట్టనుందా. ఈ వీడియో చూస్తే అలాగే అనిపిస్తోంది.
బాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్న జంటల్లో దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) జంట ఒకటి. ఈ జంటని అభిమానులు ప్రేమగా ‘డీప్‌వీర్’ (DeepVeer) అని పిలుచుకుంటూ ఉంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పది సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. అయితే.. ఇంతవరకూ వారికి పిల్లలు లేరు. ఈ విషయంపై వారిద్దరూ ఏమాత్రం మాట్లాడేవారు కాదు. ఈ తరుణంలోనే ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే వారిద్దరూ విడిపోతున్నారనేది ఆ వార్తా సారాంశం.
దీపిక, రణవీర్ కలిసి ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ (Red Carpet)పై జరిగిన ఒక సంఘటన వల్ల వారి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం అవుతోంది. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దీపిక, రణ్‌వీర్ కలిసి కారులో వచ్చారు. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ.. దీపిక చేయి పట్టుకోడానికి రణ్‌వీర్ చేయి చాచాడు. కానీ.. దీపికా మాత్రం తనని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. మరోసారి ముందుకు వెళ్లిన రణ్‌వీర్, దీపిక వైపు చూశాడు. కానీ.. దీపిక మాత్రం అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. అది చూసిన ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు.
రణ్‌వీర్‌ని దీపిక అవమానించడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. ‘ఈవెంట్‌కు ముందు గొడవ పడడం వల్ల.. వారు అలా ఉన్నారు’.. ‘రణ్‌వీర్‌తో దీపిక గౌరవం లేకుండా ప్రవర్తించింది’.. ‘వారిద్దరూ గతేడాది విడిపోయి, వేరు వేరుగా నివసిస్తున్నారు. ఆస్తులను కూడా విభజించుకున్నారు. విడాకులు వచ్చే వరకు పబ్లిక్ ఈమేజీ కోసం అలా ఉంటున్నారు’ అని వరుసగా రాసుకొస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దీపిక ‘పఠాన్’ సినిమాతో సూపర్ హిట్ సాధించింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. అలాగే.. ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కే’, హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే.. రణ్‌వీర్ సైతం కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’, ‘తఖ్త్’ సినిమాలు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..
NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్
Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా
Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..
Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?
Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..
LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’