Harish Shankar and Prakash Raj: మన సెలబ్రిటీస్ కి ఏమైంది, సమయం సందర్భం చూడాలి కదా అంటున్న నెటిజన్స్
ABN , First Publish Date - 2023-08-24T14:17:59+05:30 IST
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన దగ్గర నుండి ఈరోజు వరకు చాలా వివాదాల్లో వున్నాడు, ఉంటున్నాడు కూడా. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కూడా, వివాదాలు తెచ్చుకుంటాడు. ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం సాధించిన 'చంద్రయాన్ 3' ఘన కార్యం గురించి మాట్లాడుతుంటే, వీళ్ళిద్దరూ మాత్రం వేరే ఆలోచనలతో వున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ (HarishShankar), నటుడు ప్రకాష్ రాజ్ (PrakashRaj) లు ఇద్దరూ ఎక్కువ వివాదాల్లో వున్న వ్యక్తులే. హరీష్ శంకర్ సాంఘీక మాధ్యమంలో ఎన్నోసార్లు తన ట్వీట్ లతో, లేదా ఎక్కడో ఎదో మాట్లాడో వివాదాల్లో ఉంటూ ఉంటాడు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా, ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటాడు. తెలుగు సినిమా పరిశ్రమలో వీళ్ళిద్దరూ కూడా వివాదాస్పద వ్యక్తులే అని పరిశ్రమలో అందరికీ తెలుసు. ఒక్కోసారి సమయం, సందర్భం చూసి మాట్లాడటమే,రాయడమో చెయ్యాలి, అంతే కానీ ఏది చేతికి వస్తే అది పుసుక్కున రాసేస్తే నవ్వులపాలవుతారు అని వీరిద్దరి తాజా ట్వీట్స్ చూస్తుంటే అర్థం అయిపోతుంది.
ప్రపంచ దేశాలు అన్నీ నిన్న భారతదేశం వేపు చూస్తూ వున్నాయి, మామూలుగా కాదు, చాలా ఉత్కంఠతో, ఆసక్తితో. ఎందుకంటే తక్కువ ఖర్చుతో చంద్రుడి (Moon) ఉపరితలం మీద దించడానికి భారతదేశం, ఇస్రో #ISRO సంస్థ కొన్ని సంవత్సరాలు కష్టపడి తయారుచేసిన చంద్రయాన్ 3 #Chandrayaan3 ని పంపింది. అది ఒక మామూలు విషయం కాదు, 140 కోట్ల భారతదేశ జనాభా ఆసక్తికరంగా చూసిన సంఘటన అది.
చాలామంది సెలబ్రిటీస్ ఇది విజయవంతం కావాలని ముందు విష్ చేశారు, విజయవంతం అయ్యాక అందరూ అభినందించారు. ఇది దేశభక్తికి, దేశాన్ని, ఈ విజయం వెనక వున్న ఇస్రో లాంటి సంస్థ, అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంతమంది కృషిని అభినందిస్తూ ఉంటే, ఈ ప్రకాష్ రాజ్, హరీష్ శంకర్ లకి అదేంటో ఇవన్నీ ఒక జోక్ లాగా, లేదా ఒక మీమ్ లాగా కనిపిస్తున్నాయి. వాళ్ళు పెట్టిన ట్వీట్ చూస్తుంటే, వాళ్ళు ఇలా పెట్టడానికి ఒక సమయం, సందర్భం చూసుకోవాలి కదా, అంతే కానీ, యావత్ ప్రపంచం భారతదేశ ఖ్యాతిని పొగుడుతుంటే, మధ్యలో వీళ్ళు జోక్ అంటూ ఒకరు, మీమ్ అంటూ ఇంకొకరు...
ప్రకాష్ రాజ్ ఎదో కేరికేచర్ పెట్టాడు, అదేమో తరువాత జోక్ అంటాడు. కరెక్ట్ కానీ అది పెట్టే సందర్భం చూసుకోవాలి కదా! అదేదో సామెత చెప్పినట్టుగా ఆలా పెట్టడానికి ఒక సందర్భం, సమయం ఉండాలి కదా. భారతదేశ శాస్త్రవేత్తలు, పగలనక, రాత్రనక, నిద్ర లేక, ఈ చంద్రయాన్ 3 తయారీలో కొన్ని సంవత్సరాల నుండి పని చేస్తుంటే, ప్రకాష్ రాజ్ కి జోక్ లా అనిపించిందా అని నెటిజన్స్ మండిపడుతున్నారు. అలాగే హరీష్ శంకర్ తన పని తాను చూసుకోకుండా ఎందుకు ఆ మీమ్ ట్వీట్ చెయ్యడం, ఎందుకు ఆలా అభాసుపాలవ్వటం అని అతని మీద చాలా విమర్శిస్తున్నారు.
ఇలా నలుగురికి స్ఫూర్తిగా ఉండవలసిన సెలబ్రిటీస్ ఇలా చేస్తే ఎలా అని అడుగుతున్నారు నెటిజన్స్. ఇలా సమయం, సందర్భం చూసుకోకుండా చేతిలో మొబైల్ వుంది కదా అని ఏది పడితే అది రాసేసి పోస్ట్ చేసేస్తే, వార్తల్లో ఉండొచ్చు అనుకుంటారేమో కానీ, మీ వ్యక్తిత్వం పోతోంది అని ఎందుకు అనుకోవటం లేదు అని కూడా చాలామంది మండి పడుతున్నారు.