Isha Talwar : అలా.. ఏనాడూ అనుకోలేదు
ABN , First Publish Date - 2023-10-01T11:41:05+05:30 IST
ముంబయి భామ ఇషా తల్వార్ (Isha talwar) మలయాళ ఇండస్ర్టీతో కథానాయికగా పరిచయమైంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్ తో మాధురీ బాబీ పాత్రతో పాపులరైంది.
ముంబయి భామ ఇషా తల్వార్ (Isha talwar) మలయాళ ఇండస్ర్టీతో కథానాయికగా పరిచయమైంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్ తో మాధురీ బాబీ పాత్రతో పాపులరైంది. ప్రస్తుతం హిందీలో దూసుకుపోతున్న ఇషా గురించి కొన్ని విశేషాలు... (Mirzapur)
సినిమా నేపథ్యం నుంచి..
మా నాన్న పేరు వినోద్ తల్వార్. దర్శకనిర్మాతగా పనిచేశారు. నిర్మాత బోనీకపూర్ గారి దగ్గర మా నాన్న పని చేశారు. ఇక అమ్మ పేరు సుమన్ తల్వార్. నేను ముంబైలో పుట్టి పెరిగాను. మీకో విషయం తెలుసా.. మా నాన్నగారి మామయ్యనే తలాష్(1969) లాంటి సూపర్ హిట్ సినిమా తీశారు. అలా మాది సినిమా నేపథ్యం. దీంతో కెమెరా అంటే బెరుకు లేదు. ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చే స్వభావం నాది. అలా స్కూల్‌లో చురుగ్గా ఉండేదాన్ని.
నటిగా అవకాశం...
స్కూల్‌డే్‌సలోనే ‘హమారా దిల్ ఆప్‌కే పాస్’ చిత్రంలో బాలనటిగా నటించా. ఆ తర్వాత సినిమాల జోలికి రాలేదు. నాకెందుకో డ్యాన్స్ అంటే పిచ్చి. దీంతో 2004 సంవత్సరంలో సల్సా, జుంబా, జాజ్, హిప్‌హాప్.. ఇలా ప్రతి ఫార్మాట్‌లో సాధన చేశా. కచ్చితంగా ఓ డ్యాన్స్ స్టూడియో పెట్టి ట్యూటర్‌గా ఉండాలనుకునేదాన్ని. శిక్షణ తీసుకున్న స్టూడియోలో సాధన చేస్తోంటే కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ బ్రాండ్ల యాడ్స్ ఇరవై దాకా చేశా. మలయాళంలో ‘తట్టతిన్ మరయాత’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాలోని ఆయేషా అనే పాత్రకోసం.. భాష నేర్చుకోవటంతో గిటార్ నేర్చుకున్నా. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో పాటు సినిమా హిట్ అవ్వటంతో అవకాశాలొచ్చాయి. మలయాళంలో ఎక్కువ చిత్రాల్లో నటించా. తమిళంతో పాటు తెలుగులో గుండె జారి గల్లంతయ్యిందే.., రాజా చేయి వేస్తే చిత్రాల్లో నటించా.
ప్రేక్షకులకు నచ్చానలా..
ముంబైలో పుట్టి పెరిగి.. దక్షిణాది చిత్రాల్లో అవకాశాలెక్కువ వచ్చాయి. ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీ్‌సలో మాధురీ పాత్రలో నటించా. ఆ వెబ్‌సిరీస్ తర్వాత విచిత్రంగా ఖాళీగా ఉన్నా. అది కూడా ఏడాది ఎలాంటి సినిమాలు వొప్పుకోలేదు. వాస్తవానికి ‘మీర్జాపూర్’లో నా యాక్టింగ్ స్కిల్స్ చూశాక.. ఎవరూ ఇక ఆడిషన్స్ లేకుండా సినిమాలు చేయటానికి సిద్ధమయ్యారు. అలా ‘మీర్జాపూర్’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. పదేళ్లనుంచీ ఒక మంచి బలమైన పాత్ర దొరికితే చాలనుకున్నా. అలా ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీ్‌సతో ఆ అవకాశం దక్కింది. మాధురీ పాత్రను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. టెవిజన్ షోల్లో గెస్ట్‌గా వెళ్లటంతో పాటు వెబ్‌సిరీసుల్లో నటిస్తున్నా. హిందీలో బిజీ అయినప్పటికీ.. మలయాళంలో అవకాశాలు వస్తున్నాయి. ఇదెంతో ఆనందకరమైన విషయం. ప్రస్తుతం స్ర్కిప్ట్ ఎంపిక కోసం సమయాన్ని తీసుకుంటున్నా. దర్శకులు కూడా నాకోసం మంచి కథలు తెస్తున్నారు. ఇదెంతో మంచి పరిణామం. ఇలాంటి మంచి రోజులొస్తాయని.. అవి కూడా ఇంత త్వరగా వస్తాయని అనుకోలేదెన్నడూ.’’
సోషల్ మీడియాలో ఫిల్టర్స్ లేకుండా ఆ మాటకొస్తే మేకప్ లేకుండా ఫొటోలు అప్‌లోడ్ చేయటం నాకిష్టం. నిజ జీవితంలో ఎలా ఉంటానో.. ఆ ఎమోషన్స్‌ను చూపిస్తా. కొత్త ప్రదేశాలు, స్నేహితులు, షూటింగ్ గ్యాప్‌లో తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తుంటా.