Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన రోజు.. జాతీయ అవార్డులపై చిరంజీవి ఆసక్తికర ట్వీట్
ABN , First Publish Date - 2023-08-24T23:10:59+05:30 IST
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘జాతీయ పురస్కారాలు’ అందుకున్న వారందరికీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగిన రోజు అని.. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2021 సొంతం చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాలను కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్‌తో గ్లోబల్‌వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ చేత ‘నాటు నాటు’ స్టెప్పులు వేయించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా.. ఈ జాతీయ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ అందుకొని.. 69 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉప్పెన సినిమా, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.. ఇలా మొత్తంగా ఓ 10 అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంతమయ్యాయి. దీంతో.. ప్రతీ తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వంగా ఉప్పొంగుతున్నారు. ముఖ్యంగా.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ‘జాతీయ పురస్కారాలు’ (National Film Awards 2023) అందుకున్న వారందరికీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగిన రోజు అని.. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2021 సొంతం చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం గెలిచిన అల్లు అర్జున్ (Allu Arjun)కి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బన్నీ ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ (6), ఉప్పెన (1- ఉత్తమ తెలుగు చిత్రం), పుష్ప (2), కొండపొలం (1) పురస్కారాలు పొందడంతో.. ప్రతి ఒక్కరికీ పేరుపేరున శుభాకాంక్షలు చెప్పారు. చివరగా ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులతో పాటు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఇతర భాషా పరిశ్రమలకు చెందిన వారిని కూడా అభినందించారు.
ఇవి కూడా చదవండి:
============================
*Allu Arjun: బన్నీ ఇంట్లో ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన పుష్పరాజ్
***************************************
*Allu Arjun: జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు
***************************************
*Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
***************************************