Chiranjeevi: రామ్ చరణ్ నటనపై జేమ్స్ కెమెరూన్ పొగడ్తలు.. చిరు పుత్రోత్సాహం
ABN , First Publish Date - 2023-02-18T10:45:12+05:30 IST
పుత్రోత్సాహం అంటే.. తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగదని.. మంచి సంస్కారవంతంగా అతడు పెరిగి, పదిమంది అతడిని పొడుగుతూ.. శభాష్ అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని
పుత్రోత్సాహం అంటే.. తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగదని.. మంచి సంస్కారవంతంగా అతడు పెరిగి, పదిమంది అతడిని పొడుగుతూ.. శభాష్ అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతీ శతకకారుడి భావన. ఇప్పుడా పుత్రోత్సాహాన్ని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అనుభవిస్తున్నారు. తన కుమారుడి విషయంలో గర్వంగా ఫీలవుతున్నట్లుగా ఇప్పటికే చిరు (Chiru) పలుమార్లు చెప్పి ఉన్నారు. తాజాగా ట్వీట్ రూపంలో మరోసారి తన పుత్రోత్సాహాన్ని చిరంజీవి తెలియజేశారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, ఇప్పుడు ఆస్కార్ (Oscars) బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan) ఒక మెయిన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ నటనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురవగా.. తాజాగా హాలీవుడ్ సుప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ (James Cameron) కూడా మెగా పవర్ స్టార్ (Mega Power Star) నటనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన చరణ్ గురించి మాట్లాడుతున్న వీడియోని షేర్ చేసిన చిరంజీవి.. ‘‘మీలాంటి గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని చరణ్ పాత్ర గురించి చెప్పడం.. నిజంగా ఆస్కార్ కంటే గొప్ప అవార్డ్‌గా భావిస్తున్నాను. ఇది చరణ్‌కు చాలా గొప్ప గౌరవం. మీలాంటి వారి నుంచి ఇలాంటి గొప్ప మాటలు అందుకునే స్థాయికి వచ్చిన నా బిడ్డ రామ్ చరణ్‌ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. మీ అభినందన.. చరణ్ చేయబోయే సినిమాలకు ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను..’’ అని తెలిపారు. (Chiranjeevi Tweet)
చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘తండ్రికి తగ్గ తనయుడు’, ‘శభాష్.. మా అన్న గౌరవం నిలబెట్టావ్ కదా సామీ!!’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌తో, రీ ట్వీట్స్‌తో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి అభిప్రాయాన్ని కొందరు నెగిటివ్‌గా అర్థం చేసుకుంటున్నారు. రాజమౌళి (SS Rajamouli) గురించి కానీ, సినిమాలో నటించిన మరో హీరో ఎన్టీఆర్ (NTR) గురించి కానీ ప్రస్తావించకుండా.. కేవలం తన కొడుకు గురించే చిరు మాట్లాడటం ఏం బాగా లేదంటూ కామెంట్స్, వీడియోలు చేస్తున్నారు. కానీ, కొడుకు పేరు ఒక పెద్ద దర్శకుడి నోటి వెంట వినిపించినప్పుడు.. ఏ తండ్రికైనా ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని చిరు ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేశారు. దీనిని కూడా కొందరు తప్పు బడుతుండటం నిజంగా వారి విజ్ఞతకే వదిలేయాల్సిన విషయం. అయినా.. రాజమౌళి గురించి చిరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఆయనని ఎప్పుడో శిఖరంపై కూర్చోబెట్టాడనే విషయం తెలియంది కాదు. చిరుపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్న వారిపై.. మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే మంచిదని.. కౌంటర్స్ వదులుతున్నారు.