Ram Charan Birthday Event: రామ్ చరణ్‌లో నాగబాబుకి నచ్చిన విషయమదేనట..

ABN , First Publish Date - 2023-03-27T22:37:59+05:30 IST

మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్‌. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవిగారు (Chiranjeevi) ఎలానో..

Ram Charan Birthday Event: రామ్ చరణ్‌లో నాగబాబుకి నచ్చిన విషయమదేనట..
Mega Brother Nagababu

తండ్రికి తగ్గ తనయుడుగా, బాబాయ్ పేరుని నిలబెట్టిన అబ్బాయిగా.. గ్లోబర్ స్టార్ (Global Star) ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) పుట్టిన రోజు(మార్చి 12) వేడుకలను ఆదివారం మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ శిల్పా కళా వేదికలో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్‌. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవిగారు (Chiranjeevi) ఎలానో.. మా పిల్లలకు, మా చెల్లెలి పిల్లలకు, పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) పిల్లలకు రామ్ చరణ్‌ అలాంటి వాడు. వాళ్లకి ఏమైనా సమస్యలు వస్తే.. వాళ్లంతా ముందుగా రామ్ చరణ్‌ వద్దకు వెళ్తారు. సలహాలు, సూచనలు తీసుకుంటారు. రామ్ చరణ్‌ (Ram Charan) ప్రస్తుతం పూర్తి మెచ్యూర్డ్ పర్సన్‌గా మారాడు. అదే నాకు రామ్ చరణ్‌లో నచ్చిన విషయం. ఒకప్పుడు కాస్త కోపం, ఆవేశంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎంతో మెచ్యూర్డ్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ (Oscar) వరకు వెళ్లడం, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ స్టేజ్ మీద రామ్ చరణ్‌ బొమ్మ కనిపించడం మనందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రామ్ చరణ్‌ బర్త్ డే సందర్బంగా.. ఆరెంజ్ (Orange) సినిమాను రీ రిలీజ్ చేశాను. దాని ద్వారా వచ్చిన డబ్బును జనసేన (Janasena) పార్టీకి విరాళంగా ఇవ్వాలని అనుకున్నాను. జనం కోసం తన జీవితాన్ని వదిలేసిన నాయకుడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నాకు చేతనైన సాయాన్ని చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ చేస్తే యావరేజ్ అన్నారు. ఆర్థికంగా అప్పట్లో నష్టపోయాను. కానీ ఇప్పుడు అదే సినిమాను అందరూ బాగుందని అంటున్నారు. రెండ్రోజులుగా ఆరెంజ్ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. అంటే ఒక తరం ముందే ఆ సినిమాను తీశామని అనిపిస్తుంది. అదే సినిమాను ఇప్పుడు తీసి ఉంటే హిట్ అయ్యేది. ఇక్కడ సీఎం సీఎం అని అరిస్తే కాదు.. దమ్ముంటే ఎన్నికల్లో పాల్గొని, జనాలను ఉత్తేజ పరిచి.. ఓట్లు వేయండి’’ అని అన్నారు.

Meher-Ramesh.jpg

దర్శకుడు మెహర్ రమేష్‌ (Meher Ramesh) మాట్లాడుతూ.. చిరుత సినిమాను మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌లతో కలిసి ప్రివ్యూ చూశాను.. చరణ్ పెద్ద స్టార్ అవుతాడు.. చిరంజీవి గారి డ్యాన్స్, యాక్షన్ కాకుండా.. తనలో ఎనర్జీ ఉందని అన్నారు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత, సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో మగధీర సినిమాతో వచ్చి ఊపిరి పోశాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గారితో కలిసి రామ్ చరణ్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు మూడు పండుగలున్నాయి. చిరంజీవి గారి బర్త్ డే, పవన్ కళ్యాణ్‌‌గారి బర్త్ డే, రామ్ చరణ్‌ బర్త్ డే.. అని పేర్కొన్నారు.

Bobby.jpg

డైరెక్టర్ బాబీ (Director Bobby) మాట్లాడుతూ.. చిరంజీవిగారికి కొడుకుగా, పవన్ కళ్యాణ్‌ లాంటి వారికి అబ్బాయ్‌లా ఉండటం, పెరగడం ఎంత అదృష్ణమో.. అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్‌లతో అభిమానులను సంతృప్తి పర్చడం అంటే చిన్న విషయం కాదు. బాబాయ్‌లో ఉన్న ఆవేశం, దుడుకుదనం, రోడ్డు మీద అన్యాయం జరిగితే మాట్లాడటం, ఇన్ని కలిసి రావాలి. ఇంత ఒత్తిడిలో చిరుత నుంచి మొదలు పెట్టి గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా శ్రమించి ఉంటారో. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్‌‌గారు ఏదైనా ఒత్తిడిలో ఉంటే ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వ్యక్తి రామ్ చరణ్. ఆయన ఫోన్ చేసిన వెంటనే వచ్చి.. ఓ కొడుకులా, తమ్ముడిలా వచ్చేవాడు. నవ్వించేవాడు. ఒత్తిడిని దూరం చేసేవాడు. మెగా ఫ్యాన్‌గా రామ్ చరణ్‌ని చూస్తే ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T22:38:41+05:30 IST