Biggboss -7 Nominations : ఒకరి మీద ఒకరు కసి తీర్చుకుంటున్నారు!

ABN , First Publish Date - 2023-11-28T12:04:29+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో (Biggboss 7) చివరి కెప్టెన్సీ టాస్క్‌ పూర్తయింది. మరి  పదమూడో వారం బయటకు పంచించే కంటెస్టెంట్‌ కోసం నామినేషన్ (13th week Nominations)  ప్రక్రియ జరుగుతోంది. అదేలా సాగిందో చూద్దాం..

Biggboss -7 Nominations : ఒకరి మీద ఒకరు కసి తీర్చుకుంటున్నారు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో (Biggboss 7) చివరి కెప్టెన్సీ టాస్క్‌ పూర్తయింది. మరి  పదమూడో వారం బయటకు పంచించే కంటెస్టెంట్‌ కోసం నామినేషన్ (13th week Nominations)  ప్రక్రియ జరుగుతోంది. అదేలా సాగిందో చూద్దాం..ఈ వారం నామినేషన్స్‌ పల్లవి ప్రశాంతతో మొదలైంది. సీక్రెట్‌ టాస్క్‌లో కూడా నీ ఫ్రెండ్‌ శోభాను (9ShobaShetty)కాపాడాలనుకున్నావ్‌ అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్‌లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాశెట్టిని నామినేట్‌ చేశాడు ప్రశాంత్‌. గౌతమ్‌.. ప్రియాంక, శివాజీకి (Shivaji)రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున గారి ముందు నేను అబద్థాలే ఆడతానని నెగెటివిటీ  స్ప్రెడ్ చేసారు.  అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ మాటను నేను తీసుకోలేకపోతున్నాను’ అంటూ శివాజీకి రంగు పూసింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను నామినేట్‌ చేసింది.

ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్‌ వేసిన అర్జున్‌ ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్‌ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్‌ను అడ్డుపెట్టుకుని అమర్‌ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్‌ కాకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్‌లో గౌతమ్‌ తప్ప ఎవరూ గుర్తించలేకపోయారు.  అర్జున్‌ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్‌ను కెప్టెన్‌ చేయండి అని చెప్పుంటే ఒక మెట్టు ఎక్కేవాడు. అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్‌ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్‌ అయ్యాడు అర్జున. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్‌ కాదంటూ ప్రియాంకను నామినేట్‌ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్‌ ఇచ్చిన ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ తీేసశాడు. నువ్వు గేమ్‌ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్‌ కాదని బ్యాండ్‌ పక్కన పెట్టేశాడు. నీకు కెప్టెన్‌ కావాలని ఇంట్రస్ట్‌ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే  సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్‌ను నామినేట్‌ చేశాడు. తర్వాత గౌతమ్‌ను నామినేట్‌ చేశాడు. అమర్‌దీప్‌ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రశాంత్‌ను నామినేట్‌ చేశాడు. మ్యాన్షన్‌ గేమ్‌లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్‌ ఆడటం మిస్‌ అయ్యానంటూ సిల్లీ రీజన్‌ చెప్పాడు. ఇది విని షాక్‌ అయిన ప్రశాంత్‌.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్‌ అన్నప్పటికీ ప్రశాంత్‌ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్‌. అలాగే తనకు కెప్టెన్సీ కోసం హెల్ప్‌ చేయలేదని గౌతమ్‌ను నామినేట్‌ చేశాడు. తర్వాత యావర్‌.. గౌతమ్‌, ప్రియాంకను నామినేట్‌ చేశాడు. చివరిగా శోభా ప్రశాంత్‌, యావర్‌లను నామినేట్‌ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్‌దీప్‌ మినహా మిగతా అందరూ నామినేట్‌ అయ్యారు. 

Updated Date - 2023-11-28T12:22:58+05:30 IST