Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..
ABN , First Publish Date - 2023-10-25T12:55:34+05:30 IST
బాలయ్య మరో చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. వరస విజయాలతో తిరుగులేని దండయాత్రను కొనసాగిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. ఈసారి 6 రోజులలోనే 100 కోట్లు కొట్టేశారు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం 6 రోజులలో 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది.
బాలయ్య (Balayya) మరో చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. వరస విజయాలతో తిరుగులేని దండయాత్రను కొనసాగిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ఈసారి 6 రోజులలోనే 100 కోట్లు కొట్టేశారు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి నటసింహం చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని.. ఈ దసరాకు నిజమైన విన్నర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్ర 6 రోజల కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 6 రోజులకు గానూ 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని సాధించినట్లుగా అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో పాటు ఏరియా వైజ్‌గా కలెక్షన్లను సైతం ప్రకటించారు. వారు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ‘భగవంత్ కేసరి’ 6 రోజుల కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి. (Bhagavanth Kesari 6days Collections List)
‘భగవంత్ కేసరి’ కలెక్షన్స్ (షేర్స్‌లో) (Bhagavanth Kesari Worldwide Collections)
నైజాం: 12.7 cr
సీడెడ్: 10.9 cr
ఉత్తరాంధ్ర: 3.8 cr
గుంటూరు: 5.1 cr
కృష్ణా: 2.6 cr
నెల్లూరు: 1.8 cr
ఈస్ట్ గోదావరి: 2.4 cr
వెస్ట్ గోదావరి: 2.2 cr
కర్ణాటక: 3.8 cr
రెస్టాఫ్ ఇండియా: 0.5 cr
ఓవర్సీస్: 6.0 cr
టోటల్: 51.8 cr (Including Hires and GST)
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కగా.. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో ఉన్న కంటెంట్, నటీనటుల నటన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడంతో అఖండ విజయం దిశగా ఈ సినిమా దూసుకెళుతోంది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. సినిమా విడుదలైన 6 రోజులు అవుతున్నా.. ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే.. ఈ సినిమా మున్ముందు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ హ్యాట్రిక్ విజయంతో నందమూరి అభిమానుల (Nandamuri Fans) ఆనందానికి అయితే అవధులే లేవంటే నమ్మాలి.
ఇవి కూడా చదవండి:
============================
*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!
**************************************
*Bubblegum: రోషన్ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..
********************************
*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?
**********************************