Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

ABN , First Publish Date - 2023-07-03T15:26:28+05:30 IST

‘‘మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఎప్పుడూ.. ఏ విధంగానూ మీ కీర్తిని గానీ, మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను’’ అని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌కు గురుపౌర్ణమి సాక్షిగా ప్రామిస్ చేశారు.

Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..
Bandla Ganesh about Pawan Kalyan

‘‘మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఎప్పుడూ.. ఏ విధంగానూ మీ కీర్తిని గానీ, మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను’’ అని బండ్ల గణేష్ (Bandla Ganesh) ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)‌కు ప్రామిస్ చేశారు. గురుపౌర్ణమి (Guru Poornima) పర్వదినాన్ని పురస్కరించుకుని.. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్‌ని మొదటి నుంచి దేవుడి (God)గా భావిస్తూ.. తనని భక్తుడిగా పోల్చుకునే బండ్ల.. ఇప్పుడు గురువుగా పవన్ కల్యాణ్‌ని భావిస్తూ.. గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

వాస్తవానికి బండ్ల గణేష్.. ఈ మధ్య ‘గురువు’ అని సంభోదిస్తూ.. త్రివిక్రమ్‌ (Trivikram)పై పంచ్‌లు పేలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు నా గురువు, నా దైవం పవన్ కల్యాణ్ అనేలా.. తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ‘నా చూపు, నా ఆశ ఒకటే.. మీరు అనుకున్న ఆశయం సాధించాలి, సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’.. అని బండ్ల మనసులోని మాటని బయటపెట్టాడంటూ.. నువ్వు ఇలానే ఉండాలన్నా అంటూ.. మెగా అభిమానులు (Mega Fans) ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్ట్‌లోని మరో మాట కూడా ఫ్యాన్స్‌ కామెంట్స్‌కి కారణం అవుతోంది. ‘వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటా’ అంటూ బండ్ల మరోసారి తన స్వామి భక్తిని ప్రకటించుకున్నాడనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Pawan-Kalyan.jpg

అసలు బండ్ల ఏమని ట్వీట్ చేశారంటే.. (Bandla Ganesh Tweet on Pawan Kalyan)

‘‘గురుపౌర్ణమి సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’’ అంటూ గురువు పవన్ కల్యాణ్‌ని బండ్ల గణేష్ నమస్కారం పెట్టారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

**************************************

*VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’

**************************************

*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!

**************************************

Updated Date - 2023-07-03T15:26:28+05:30 IST