Balagam: ‘బలగం’ పెద్దమనిషి ఇక లేరు..
ABN , First Publish Date - 2023-09-05T19:54:47+05:30 IST
తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి ప్రాతకు ఇంపార్టెన్స్ ఉండేలా దర్శకుడు వేణు ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో పెద్దమనిషి పాత్ర అదే.. ఊరి సర్పంచ్ పాత్రలో నటించిన కీసరి నర్సింగం మంగళవారం కన్నుమూశారు.
తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ (Balagam) సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి ప్రాతకు ఇంపార్టెన్స్ ఉండేలా దర్శకుడు వేణు ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో పెద్దమనిషి పాత్ర అదే.. ఊరి సర్పంచ్ పాత్రలో నటించిన కీసరి నర్సింగం (Keesari Narsimgam) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుపుతూ దర్శకుడు వేణు (Venu Yeldandi) సోషల్ మీడియా వేదికగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఎలా చనిపోయారనే విషయం తెలియదు కానీ.. చిన్న పాత్ర అయినా సరే.. చాలా న్యాచురల్‌గా నటించి నర్సింగం మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన మృతిపట్ల చిత్రయూనిట్‌తో పాటు, పలువురు నెటిజన్లు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
‘‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏
మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏
బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం.. 🙏’’ అని.. నర్సింగంతో ఉన్న ఫొటోలను వేణు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఓం శాంతి అంటూ.. నర్సింగం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
‘బలగం’ సినిమా విషయానికి వస్తే.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో.. ‘పిట్టకు వెట్టుడు’ అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని రికార్డులను క్రియేట్ చేసింది. ఇంకా ఈ సినిమా గురించి అక్కడక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నారంటే.. సినిమా ఉన్న కంటెంట్ అలాంటిది. దర్శకుడు వేణు ఈ సినిమాతో ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆయన రెండో సినిమాకు సంబంధించిన వివరాలు రానున్నాయి.
ఇవి కూడా చదవండి:
============================
*Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి
*************************************
*Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!
*************************************
*Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!
************************************
*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు
*************************************