Anupama Parameshwaran: అందరికీ పెళ్ళయిపోతోంది, కానీ నేను బయటకి వెళ్లాలంటే మాత్రం...

ABN , First Publish Date - 2023-09-18T14:02:26+05:30 IST

అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ సాంఘీక మాధ్యమంలో చాలా హుషారుగా ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పెట్టిన ఒక పోస్ట్, ఆమె వయసు గురించి, తన తోటివాళ్ళు ఆ వయసులో ఏమి చేస్తున్నారు అనే విషయం వైరల్ అయింది.

Anupama Parameshwaran: అందరికీ పెళ్ళయిపోతోంది, కానీ నేను బయటకి వెళ్లాలంటే మాత్రం...
Anupama Parameshwaran

అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameshwaran) మలయాళం నటి అయినా, తెలుగులోనే ఎక్కువ ప్రాముఖ్యం సంపాదించింది. మలయాళం 'ప్రేమమ్' #Premam సినిమాతో పరిచయం అయిన అనుపమ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వం వహించిన 'అ.. ఆ..' #A..Aa.. సినిమాతో ఆరంగేట్రం చేసింది. నితిన్ (Nithiin) ఇందులో కథానాయకుడు. తన మొదటి సినిమాతో ఆమె తన ప్రతిభను చూపించి అందరినోటా ప్రసంశలు అందుకుంది. అనుపమ అంటేనే ఒక మంచి టాలెంట్ వున్న నటి అని అందరూ అంటారు, కానీ ఎందుకో తెలుగులో ఆమెకి ఇంకా మంచి పాత్రలు రాలేదని అనిపిస్తూ ఉంటుంది.

Anupama  (2).jpg

అనుపమ ఎప్పుడూ సాంఘీక మాధ్యమాల్లో బిజీగా ఉంటూ ఉంటుంది. తన ఫోటోస్ పోస్ట్ చెయ్యడం, అభిమానులతో మాట్లాడటం, ఇంకా అనేక విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఈమధ్య కొంచెం గ్లామరస్ ఫోటోస్ కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. ఆశిష్ రెడ్డి (AshishReddy) తో 'రౌడీ బాయ్స్' (RowdyBoys) సినిమాలో మొదటిసారిగా లిప్ లాక్ సన్నివేశంలో నటించిన అనుపమని చూసి ఆమె అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అదే విషయాన్ని ఆమెతో సాంఘీక మాధ్యమంలో చెప్పారు కూడా.

ఇప్పుడు అనుపమ 'డీజే టిల్లు' #DJTillu కి సీక్వెల్ గా వస్తున్న 'టిల్లు స్క్వేర్' #TilluSquare సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో సిద్ధూ జొన్నలగెడ్డ (SiddhuJonnalagadda) కథానాయకుడు కాగా మల్లిక్ రామ్ (MallikRam) దర్శకుడు. మామూలుగా సిద్ధూ సినిమాలన్నిటిలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది అని అభిమానులు పాపం అనుపమ ఏంటి ఇలాంటి సినిమా చేస్తోంది అని ఆమెకి సాంఘీక మాధ్యమంలో అన్నారు. అయితే అనుపమకు ఎందుకో పెద్ద సినిమాలు రావటం లేదు, అందుకని ఈ సినిమా చేస్తోంది అని కూడా ఒక టాక్ నడుస్తోంది.

anupama1.jpg

ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో అనుపమ ఒక స్టోరీ పెట్టింది. అందులో తన వయస్సు గురించి ప్రస్తావిస్తూ, ఆమె వయసులో వున్నవాళ్లు కొంతమంది వివాహం చేసుకుంటున్నారని, ఇంకా కొంతమంది ప్రెగ్నంట్ అవుతున్నారని, కానీ తాను మాత్రం బయటకి వెళ్లాలంటే ఇంకా అనుమతి తీసుకొని వెళ్లాలని అంటోంది. (My age is pretty weird, some are getting married, some are getting pregnant, and me... still asking permission to go out!) అంటే దీనర్థం తాను స్వతంత్రంగా లేను, ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రుల అనుమతి కంపల్సరీ అని చెప్తోందా? దీనిభావమేమి తిరుమలేశ !

Updated Date - 2023-09-18T14:07:54+05:30 IST