Ravi and Rakesh: యాడ్ కోసం సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్
ABN , First Publish Date - 2023-01-04T19:03:37+05:30 IST
హైదరాబాద్‌లో ఓ యాడ్ కోసం సినిమా స్థాయిలో భారీ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెట్స్‌లో బిగ్ బాస్ యాంకర్ రవి..
హైదరాబాద్‌లో ఓ యాడ్ కోసం సినిమా స్థాయిలో భారీ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెట్స్‌లో బిగ్ బాస్ యాంకర్ రవి (Anchor Ravi), జబర్దస్త్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) సందడి చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల వెనుక ఉన్న విషయం ఏమిటా అని ఆరా తీస్తే.. ఇదొక యాడ్ కోసం చేశారని తెలుస్తోంది. గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కిషోర్ ఆధ్వర్యంలో వంద శాతం ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ ‘లూయిస్ పార్క్’ (Louis Park) కోసం భారీ స్థాయిలో సెట్టింగ్స్ వేశారు.
ఈ బ్రాండ్‌ను భారతదేశంలోనే తొలిసారిగా ఏపీ, తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్‌ని చిత్రీకరిస్తున్నారు. జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ (Yashwanth)లు ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్నారు. ఈ యాడ్‌ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేస్తుండగా.. ‘జబర్దస్త్’కి రైటర్‌గా చేసిన సుభాష్ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం సరికొత్త అవతారంలో ఉన్న రాకింగ్ రాకేష్, యాంకర్ రవి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.