Anasuya: నిన్న చూసింది శాంపిల్ మాత్రమే, ఇవాళ వీడియోలో అయితే మరీ అరాచకం

ABN , First Publish Date - 2023-06-05T17:52:43+05:30 IST

ఎప్పుడూ వార్తల్లో ఉంటూ, సాంఘీక మాధ్యమంలో కూడా చురుకుగా వుండే అనసూయ ఈసారి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అనసూయ ఎన్నో గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేసినా, ఈ వీడియో మాత్రం ఇప్పటి వరకు చూడని అనసూయ...

Anasuya: నిన్న చూసింది శాంపిల్ మాత్రమే, ఇవాళ వీడియోలో అయితే మరీ అరాచకం

గత రెండు రోజుల నుండి ప్రముఖ యాంకర్, నటి అనసూయ #Ansuya సాంఘిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తోంది. తన అందాలతో, ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెట్టె అనసూయ ఈసారి మరీ రెచ్చిపోయింది అని నెటిజన్స్ అంటున్నారు. నిన్న తన పెళ్లి రోజు కానుకగా నెటిజన్స్ అందరికీ తన భర్తతో ఒక లిప్ లాక్ పెట్టిన ఫోటో పెట్టిన అనసూయ ఈరోజు ఒక వీడియో షేర్ చేసింది.

anasuyabharadwajnew1.jpg

తన పెళ్లిరోజుకి అనసూయ, తన భర్త భరద్వాజ్ (AnasuyaBharadwaj) తో కలిసి హాలిడే కి వెళ్ళింది. అదే రోజు బీచ్ లో భర్తతో చాలా గ్లామరస్ ఫోటోస్ కూడా పోస్ట్ చేసి, నెటిజన్స్ అందరికీ కనువిందు చేసింది. అనసూయ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటుంది. నటుడు విజయ్ దేవరకొండ (VijayDeverakonda) ని రెండు మూడు సార్లు విమర్శించి సాంఘీక మాధ్యమం లో సందడి చెయ్యడమే కాకుండా, నెటిజన్స్ అందరూ ఆమెని బాగా విమర్శించారు కూడా.

అలాగే అనసూయ వేసుకునే డ్రెస్ లను కూడా నెటిజన్స్ బాగా విమర్శిస్తూ ఉంటే, వాటికీ అనసూయ చాలా బోల్డ్ గా సమాధానాలు చెప్పే సందర్భాలు కూడా ఎన్నో వున్నాయి. అలాగే ఆమధ్య 'ఆంటీ' #Aunty అనే పదం మీద కూడా చాలా వార్తలు వచ్చాయి, అనసూయ సైబర్ పోలీస్ వరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసింది.

anasuyabharadwajnew2.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు అనసూయ పోస్ట్ చేసిన వీడియో అయితే మరీ ఏంటి అనసూయ ఇంతలా రెచ్చిపోయింది అని నెటిజన్స్ అంటున్నారు. ఆమె వీడియో కిందా చాలా నెగటివ్ కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ ఇలాంటివి పట్టించుకోదు, ఎందుకంటే ఆమెకి తెలుసు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే, ఎలాంటి కామెంట్స్ వస్తాయో. అలాగే ఆమె ఇలాంటివి ఎన్నో బోల్డ్ ఫోటోస్, వీడియోస్ ఇంతకు ముందు పోస్ట్ చేసింది కానీ, ఈ వీడియో మాత్రం వాటన్నిటితో పోలిస్తే చాలా గ్లామర్ గా ఉందనే చెప్పాలి అని అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2023-06-06T12:01:37+05:30 IST