AnasuyaBharadwaj: మళ్ళీ వాటి మీదే కామెంట్, ఘాటుగా సమాధానం చెప్పిన అనసూయ

ABN , First Publish Date - 2023-07-03T16:23:05+05:30 IST

వివాదాలు యాంకర్, నటి అనసూయకి కొత్త కాదు. ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఆమె ఉంటూ వస్తోంది, ముఖ్యంగా సాంఘీక మాధ్యమంలో. అందులో ఎవరో ఎదో కామెంట్ చెయ్యటం, దానికి అనసూయ తనదైన శైలిలో సమాధానం ఇవ్వటం, ఇప్పుడు ఈసారి ఇంకో వివాదం, అనసూయ ట్వీట్ వైరల్, ఎందుకంటే...

AnasuyaBharadwaj: మళ్ళీ వాటి మీదే కామెంట్, ఘాటుగా సమాధానం చెప్పిన అనసూయ
Anasuya Bharadwaj

ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (AnasuyaBharadwaj) మళ్ళీ వార్తల్లో వున్నారు. అనసూయ తాను చెయ్యబోయే సినిమాలతో, షో లతో చాలా బిజీగా ఉంటోంది. ఈమధ్యనే ఆమె చేసిన 'విమానం' #VImanam విడుదల అయింది, అందులో అనసూయ వేశ్య పాత్ర పోషించింది. తరువాత 'పుష్ప 2' #Pushpa2 సినిమా షూటింగ్ లో బిజీ గా వుంది, అలాగే వేరే సినిమా షూటింగ్ లు కూడా చేస్తోంది. ఇప్పుడు అమెరికా వెళ్ళింది అనసూయ. అక్కడ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DeviSriPrasad) అమెరికా మ్యూజిక్ టూర్ లో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. ఇలా వివిధ రకాలుగా అనసూయ తన కెరీర్ లో బిజీ గా ఉంటోంది. అయితే అమెరికా వెళ్లినా, అనసూయని వివాదాలు మాత్రం వదిలేట్టు లేదు, ఈసారి కూడా సాంఘీక మాధ్యమంలోనే వివాదం. కానీ ఇంకో యాంకర్ కూడా వుంది ఇందులో. అయితే సాంఘీక మాధ్యమంలో ఒక నెటిజెన్ ఎదో కామెంట్ పెడితే, దానికి అనసూయ చాలా ఘాటుగా, బోల్డ్ గా సమాధానం చెప్పింది. ఇలాంటి బోల్డ్, ఘాటు సమాధానాలు చెప్పే ధైర్యం ఒక్క అనసూయకు వుంది అనిపిస్తుంది. డేరింగ్ లేడీ అనసూయ !

అయితే ఇక సోషల్ మీడియా అనగానే తెలుగునుండి ఎక్కువగా వివాదాల్లోకి కనిపించేది అనసూయ మాత్రమే. ఆమధ్య నటుడు విజయ్ దేవరకొండ (VijayDeverakonda) ని ఎదో కామెంట్ చేస్తే, అతని అభిమానులు అనసూయని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదానికి ఇక స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను అని, అతని అభిమానులు ఏమి కామెంట్ చేసినా తాను ఏమి స్పందించాను అని చెప్పేసింది కూడా. అయితే అది అక్కడితో అయిపొయింది అనుకుంటే, మరో వివాదమైన ట్వీట్‌తో వార్తల్లో నిలిచింది.

anasuya4.jpg

ఇంకో యాంకర్, నటి రష్మీ గౌతమ్ (RashmiGautam) కూడా సాంఘీక మాధ్యమంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కూడా చాలామందికి ఘాటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఆమె ఈమధ్య ఎదో మతం గురించి వచ్చిన చర్చల్లో తన స్పందన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. అయితే అక్కడ నుండి చర్చ మొదలైంది. రష్మీ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, అందులో అనసూయ ప్రస్తావన కూడా తీసుకు వచ్చాడు. దానికి అనసూయ తనదైన స్టయిల్ లో సమాధానం చెప్పింది. ఇంతకీ అతను ఏమని అన్నాడు అంటే, "బాల్స్ కలిగిన చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నారు" అని అన్నాడు.

దీనికి అనసూయ సమాధానం ఇస్తూ, "ముందు మీరన్నదానికి కరెక్ట్ చేస్తున్నాను. కానీ నాకు పూర్తిగా తెలిసిన విషయాలపై మాట్లాడటానికి ఇది ఉంది. అలాగే ఎవరు ఏమి మాట్లాడాలనుకున్న అది వారి వ్యక్తిగతం. అందరూ ఒకేలా స్పందించాలనుకోవడం న్యాయం కాదు అంకుల్" అంటూ చాలా పోస్ట్ చేసింది. మీరే అనసూయ పోస్ట్ చూడండి. అయితే ఇది రష్మీ గౌతమ్ కి ఎవరో ఇచ్చిన సమాధానంలో అనసూయ పేరు కూడా పెట్టడం వలన, అనసూయ ఈ ఘాటు సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఈ అనసూయ ట్వీట్ వైరల్ అయింది, మళ్ళీ చర్చలు, వివాదాలు.

Updated Date - 2023-07-03T16:23:05+05:30 IST