Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

ABN , First Publish Date - 2023-06-09T16:54:13+05:30 IST

అనసూయ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విజయ్ దేవరకొండ విషయంలో రియాక్ట్ కానని ప్రకటించింది. ఆయన ఫ్యాన్స్‌ చేసే ట్వీట్స్ కూడా పట్టించుకోనని తెలిపింది. ప్రస్తుతం తను అలసిపోయినట్లుగా తెలుపుతూ.. ఇకపై వీటన్నింటికి దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను పొందాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తన తాజా ఇంటర్వ్యూలో ప్రకటించింది.

Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను
Anasuya and Vijay Deverakonda

రీసెంట్‌గా తన పెళ్లి రోజు (Marriage Day)ని పురస్కరించుకుని యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలు ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే. అంతకు ముందు కూడా సోషల్ మీడియాలో తనని విమర్శించిన వారిపై తగ్గేదే లే అన్నట్లుగా ఆమె కౌంటర్స్ ఇస్తూ వస్తుంది. మరీ ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా అప్పటి నుంచి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఆమె టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇటీవల ‘ఖుషి’ (Kushi) సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌లో ‘ది దేవరకొండ’ అని ఉండటాన్ని కూడా ఆమె తప్పుబట్టింది. ఈ సందర్భాలన్నింటిలోనూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ (Vijay Deverakonda Fans) ఆమెను ‘ఆంటీ’ (Aunty) అంటూ ట్రోల్ చేశారు. ఇంకా ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టేశారు. అయినా కూడా అనసూయ వెనక్కి తగ్గలేదు. కౌంటర్స్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా మారింది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమోగానీ.. ఇకపై విజయ్ దేవరకొండ, అతని ఫ్యాన్స్‌తో పెట్టుకోనని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Anasuya-3.jpg

విజయ్ దేవరకొండ విషయంలో మీరెందుకలా రియాక్ట్ అవుతున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘విజయ్ దేవరకొండకు, నాకు ఎటువంటి గొడవలు లేవు. మేమిద్దం మంచి స్నేహితులం కూడా. ఆయన నిర్మాతగా చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నాకు చాలా మంచి రోల్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమా కంటే ముందే వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నేను వ్యతిరేకించాను. అందులో విజయ్ మాట్లాడే భాష నాకు నచ్చలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో పబ్లిక్ స్టేజ్‌‌పై కూడా అదే భాష వాడాడు. నాకు అది కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అంతే తప్ప.. అతనిపై నాకు ఎటువంటి ధ్వేషం లేదు. (Anasuaya about Fight with Vijay Fans)

Anasuya-2.jpg

కాకపోతే.. ఇక్కడొక విషయం చెప్పాలి. నాపై అతని ఫ్యాన్స్ చేసే ట్రోల్స్ అన్నీ అతనికి తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను. అంతేకాదు.. అతని దగ్గర పనిచేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి మరీ నా పై ట్రోలింగ్ చేయిస్తున్నట్లుగా కూడా నా నోటీస్‌కు వచ్చింది. ఇది తెలిసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ విషయం విజయ్‌కి తెలియకుండానే జరుగుతుందా? అని అనిపించింది. అందుకే ఇకపై ఈ గొడవలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటికే బాగా అలసిపోయాను. అన్నీ ఆపేసి మానసిక ప్రశాంతత పొందాలని అనుకుంటున్నాను. ఇకపై ఎవరేం మాట్లాడినా.. రియాక్ట్ కాకూడదనే నిర్ణయం తీసుకున్నాను’’ అని అనసూయ చెప్పుకొచ్చింది. (Anasuya's Sensational Decision)

Anasuya-1.jpg

అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. తెలివిగా అనసూయ ఈ విషయాన్ని విజయ్ సైడ్‌కి నెట్టేసిందనేలా కామెంట్స్ పడుతున్నాయి. విజయ్ దేవరకొండ దగ్గర పని చేసే వ్యక్తి చేయిస్తున్నాడని, అతనికి తెలిసే ఉంటుందనేలా ఆమె మాట్లాడిన తీరు.. తప్పంతా దేవరకొండది, అతని ఫ్యాన్స్‌దే అన్నట్లుగా ఆమె చెబుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై విజయ్ (Vijay) అండ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

*Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

*Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!

Updated Date - 2023-06-09T17:09:15+05:30 IST