Anasuya: అనసూయ ఎందుకు గుక్కపెట్టి ఏడుస్తోంది... ఏం జరిగింది?

ABN , First Publish Date - 2023-08-19T15:41:58+05:30 IST

ఎప్పుడూ సాంఘీక మాధ్యమాల్లో తన తన సినిమాల గురించి, తన వ్యక్తిగతం గురించి ఎక్కువగా ఫోటోలు షేర్ చేస్తూ, తాను ఎక్కడ వున్నా అభిమానులందరినీ పలకరించే అనసూయ ఈసారి పోస్ట్ చేసిన వీడియో చూసి షాకవుతున్నారు అందరూ..

Anasuya: అనసూయ ఎందుకు గుక్కపెట్టి ఏడుస్తోంది... ఏం జరిగింది?
Anasuya

ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anasuya) ఈమధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆమధ్య విజయ్ దేవరకొండ (VijayDeverakonda) మీద ఎదో కామెంట్ పెట్టింది, విజయ్ అభిమానులకి, అనసూయకి సాంఘీక మాధ్యమంలో వాదోపవాదాలు జరిగాయి. ఇక అలాంటిదే ఆమె ఎప్పుడూ ఏదైనా పోస్ట్ పెట్టో, లేదా ట్వీట్ చేసి ఇలా వార్తల్లో ఉంటూ వుండే అనసూయ మళ్ళీ వార్తలకెక్కింది. అయితే ఈసారి ఆమె తన ఇన్స్టాగ్రామ్ (Instagram) లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది.

ఇలా ఏడుస్తూ వున్నవీడియో పెట్టి ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాసింది. మరి ఆమెకి ఎవరు ఏమన్నారో, ఎందుకు ఆలా అంత సుదీర్ఘ నోట్ పెట్టిందో తెలియయటం లేదు కానీ, నోట్ సారాంశం మాత్రం, సాంఘీక మాధ్యమం అనేది అందరినీ కలిపేలా ఉంటుంది, అలాగే ఒకరి విషయాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది అని, అలాగే వేరేవాళ్ళ జీవన విధానం, సంస్కృతి తెలియటం కోసం ఇది ఒక మంచి ప్రదేశం అని భావించాను, కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను, అని రాసింది.

Anasuya-2.jpg

ఇలా రాసుకుంటూ, ఆమె ఫోటోస్, డాన్స్ వీడియోస్ ఇంకా ఆమె వ్యక్తిగతమైనవి ఏది ఆమె పోస్ట్ చేసిన అవన్నీ ఆమె జీవితంలో ఒక భాగం అని చెప్తోంది. అవన్నీ ఆమె అభిమానులతో పంచుకుంటాను అవన్నీ కూడా ఆమె జీవితంలో జరిగే సంఘటనలు, స్ట్రాంగ్ గా వున్నప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు అలాంటివి అన్నీ వున్నాయి అని చెప్పింది.

ఇంతకీ ఆమె చెప్పదలచుకున్నది ఏంటంటే, ఆమెకి న్యూట్రల్ గా ఉండటం, డిప్లొమాసి ఇలాంటివి తెలీదు, ఆమె ఏమనుకుంటుందో అది చెప్పడమే ఆమెకి తెలుసు అని చెప్పింది. అలాగే చివర్లో అందరిని ప్రేమగా వుండండి అని చెప్తోంది. ఇతరుల పట్ల ద్వేషం వద్దు, ఎందుకంటే ఆమె/అతడు ఒక్కోసారి బాడ్ డే గా ఉంటుంది, అందుకని ఇతరుల పట్ల కొంచెం ప్రేమ చూపండి అంటోంది. అలాగే చివర్లో నేను బాగున్నాను, ఇది అయిదు రోజుల క్రితం రికార్డు చేసింది అని ఎదో చెప్పుకొచ్చింది.

Anasuya-3.jpg

కిందని కామెంట్స్ లో మాత్రం ఇంతకీ అనసూయ ఏమైంది మీకు అని అభిమానులు అడుగుతున్నారు. కొందరు ఆమెకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు, కొందరేమో ఆమె రాసింది అర్థం కావటం లేదు అని అంటున్నారు, ఇలా రకరకాలుగా ఈ వీడియో మీద కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Updated Date - 2023-08-19T15:43:17+05:30 IST