Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 28 , 2023 | 09:29 PM

తమిళనాడు స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ మృతితో ఇటు సినిమా, అటు రాజకీయ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే విజయకాంత్‌ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవడంతో పాటు.. వివాదాస్పదంగానూ మారింది.

Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Director Alphonse Puthren

తమిళనాడు స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ (Captain Vijayakanth) మృతితో ఇటు సినిమా, అటు రాజకీయ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. అయితే విజయకాంత్‌ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవడంతో పాటు.. వివాదాస్పదంగానూ మారింది. ఇన్‌స్టా వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) తనయుడు, మంత్రి, హీరో అయిన ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin)కు రాసినట్లుగా ఉన్న ఈ పోస్ట్‌లో.. ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టకపోతే మాత్రం.. నెక్ట్స్ మీ తండ్రి స్టాలిన్, అలాగే మిమ్మల్ని కూడా వారు టార్గెట్ చేసే అవకాశం ఉందంటూ.. అల్ఫోన్స్ పుత్రేన్ (Alphonse Puthren) షాకింగ్ కామెంట్స్ చేశారు.

Stalin.jpg

‘‘ఉదయనిధి స్టాలిన్ అన్నా.. కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని మీరు రాజకీయాలలోకి రావాలి అని చెప్పాను. కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు హత్య చేశారో కూడా కనిపెట్టాలి. ఇదంతా ఏముందిలే అని పక్కన పెట్టేస్తారేమో.. ఇప్పటికే స్టాలిన్ సార్‌‌పై, ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్ గారిపై.. హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవేళ ఈ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే.. స్టాలిన్ సార్‌ని, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు.


Puthren-Alphonse.jpg

‘నీరం’ సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. గుర్తుందా? ఐ ఫోన్ సెంటర్‌కు కాల్ చేసి 15 నిమిషాల్లో బ్లాక్ కలర్‌లో ఉన్న ఐఫోన్‌ను తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా.. మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా. మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్ అని భావిస్తున్నా..’’ అని అల్ఫోన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

****************************

*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

*****************************

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

Updated Date - Dec 28 , 2023 | 09:29 PM