Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2023-06-16T11:11:58+05:30 IST
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాఘవుడిగా.. కృతిసనన్ (Kriti Sanon) జానకిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. మొదట్లో టీజర్ విడుదలైనప్పుడు విమర్శలను ఫేస్ చేసిన ఈ చిత్రం.. విడుదల సమయం దగ్గర పడే కొద్ది.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలను క్రియేట్ చేసింది. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై పబ్లిక్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాఘవుడిగా.. కృతిసనన్ (Kriti Sanon) జానకిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. మొదట్లో టీజర్ విడుదలైనప్పుడు విమర్శలను ఫేస్ చేసిన ఈ చిత్రం.. విడుదల సమయం దగ్గర పడే కొద్ది.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ‘జైశ్రీరామ్’ (Jai Shri Ram) సాంగ్ విడుదలైన తర్వాత.. ఈ సినిమాపై ప్రేక్షకులు దృష్టి పెట్టడం మొదలెట్టారు. అలాగే తిరుపతి (Tirupati)లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాని వార్తలలో ఉంచుతూ వచ్చాయి.
ఇక ఈ సినిమాపై ప్రేమ కురిపిస్తూ కొందరు బల్క్‌గా టికెట్స్ కొనేసి అనాథ ఆశ్రమాలలోని వారికి ఫ్రీగా ఈ సినిమాని చూపిస్తామని ప్రకటించడం, ‘ఆదిపురుష్’ (Adipurush) థియేటర్లలో ఓ సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతున్నామని మేకర్స్ ప్రకటించడం.. ఇలా ‘ఆదిపురుష్’పై అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. మరి భారీ అంచనాలతో, అంతే స్థాయి క్రేజ్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..
ఈ సినిమాని 2Dలో కంటే 3Dలో చూస్తేనే అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారనేలా ఎక్కువ మంది చెబుతున్నారు. అలాగే రాముడి పాత్రలో ప్రభాస్ నటన బాగుందని కొందరు.. ఇదేదో వీడియో గేమ్‌లా ఉందని మరికొందరు అంటున్నారు. ఓవరాల్‌గా అయితే ప్రభాస్ నటన, కొన్ని సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంటే.. సినిమాటిక్ లిబర్టీ కోసం ఓం రౌత్ చేసిన కొన్ని ప్రయోగాలు, ఎమోషన్స్ లేకపోవడం, లంకేష్ పాత్ర, సాగదీత సీన్లు, విఎఫ్‌ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన మైనస్‌లు అంటూ పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను
**************************************
*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..
**************************************
*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!
**************************************
*SJ Suryah: అమితాబ్ బచ్చన్ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..
**************************************
*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి
**************************************
*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..
**************************************