Prakash Raj: చాంద్రాయన్ 3 మీద సరదా కార్టూన్ పెట్టినందుకు కేసు ఫైల్ చేశారు

ABN , First Publish Date - 2023-08-23T13:34:11+05:30 IST

ప్రముఖ క్యారెక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డట్టు కనపడుతోంది. అతను చంద్రయాన్ 3 మీద పెట్టిన ఒక సరదా కార్టూను అతనికి చిక్కులు తెచ్చి పెట్టింది. కర్ణాటకలోని ఒక పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు ఫైల్ చేశారు, అలాగే అతన్ని అరెస్టు చెయ్యాలంటూ నెట్టింట ట్రేండింగ్ కూడా అవుతోంది.

Prakash Raj: చాంద్రాయన్ 3 మీద సరదా కార్టూన్ పెట్టినందుకు కేసు ఫైల్ చేశారు
According to reports a complaint has been filed against actor Prakash Raj for his post on the Chandrayaan-3 mission in Banahatti police station of Bagalkote district, Karnataka

ప్రముఖ క్యారెక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ (PrakashRaj) న్యాయపరమైన చిక్కుల్లో పడేట్టు కనపడుతోంది. 'చాంద్రాయన్ 3' #Chandrayaan3 చంద్రుడు (Moon) నుండి కొన్ని చిత్రాలు పంపింది అని ఇస్రో #ISRO శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు, ప్రకాష్ రాజ్ తన సాంఘీక మాధ్యమంలో ఒక ఫన్నీ కేరికేచర్ పెట్టాడు. అందులో ఒక మనిషి లుంగీ కట్టుకొని, కాఫీ కలుపుతూ కనిపిస్తాడు. అది బ్రేకింగ్ న్యూస్ అంటూ, మొదటి చిత్రం చంద్రుడు నుండి విక్రమ్ లాండర్ #VikramLander పంపింది అని పెట్టాడు ప్రకాష్ రాజ్.

అయితే ఆ ఫన్నీ కేరికేచర్ ఎవరికీ అర్థం కాలేదు, కానీ అది పెట్టవలసిన సమయం ఇది కాదు అని మాత్రం చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రకాష్ రాజ్ ఆలా పెట్టినందుకు అతన్ని నెట్టింట ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తరువాత ప్రకాష్ రాజ్ ఆ పెట్టిన కార్టూన్ కి వివరణ ఇస్తూ, అది ఒక జోక్ అని, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు మన కేరళ ఛాయివాలా వున్నాడు అని చెప్పే జోక్ అని, అది అర్థం చేసుకోనివాళ్ళు జోక్ అయిపోతారని చెప్పాడు.

chandrayaan3.jpg

ప్రపంచం అంతా చాంద్రయాన్ 3 #Chandrayaan3 ఎప్పుడు, ఎలా చంద్రుడు మీద లాండ్ అవుతుంది అనే ఉత్కంఠ తో ఉంటే, ప్రకాష్ రాజ్ ఇలా కార్టూన్ పెట్టడం నెట్టింట చాలామంది అతన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన కొన్ని హిందూ సంస్థలు బాణహట్టి (Banahatti) పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారని తెలిసింది. ఇది బగల్కోటే ( Bagalkote) జిల్లాలో వుంది. ప్రకాష్ రాజ్ మీద కంప్లైంట్ ఇచ్చి, అతని మీద యాక్షన్ తీసుకోమని ఆ కంప్లైంట్ లో చెప్పారని తెలిసింది. నెట్టింట అయితే ప్రకాష్ రాజ్ ని ఆరెస్ట్ #ArrestPrakashRaj చెయ్యమన్న హేష్ టాగ్ కూడా ట్రేండింగ్ లో వుంది.

ప్రకాష్ రాజ్ తాను ఇస్రో సంస్థను అగౌరవ పరచడానికి పెట్టిన కార్టూన్ కాదని, అది ఒక జోక్ మాత్రమే అని వివరణ ఇచ్చాడు. అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కూడా అది పెట్టలేదని చెప్పాడు.

Updated Date - 2023-08-23T13:34:11+05:30 IST