Vijay Deverakonda: విజయ్ పై అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన వ్యక్తి అరెస్ట్..

ABN , First Publish Date - 2023-12-13T17:22:28+05:30 IST

సినిమా నటీనటులమీద, లేదా సెలబ్రిటీ మీద అసభ్యకరమైన పోస్టులు, వార్తలు రాస్తే కఠిన చర్యలు, వెంటనే ఆ వీడియోలు తీసెయ్యాలి...

Vijay Deverakonda: విజయ్ పై అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన వ్యక్తి అరెస్ట్..
Vijay Deverakonda

ఒక నటుడు ఎంతో కష్టపడి ఒక చిన్న స్థాయి నుండి సూపర్ స్టార్ లా ఎదగడం వెనకాల అతని కష్టం ఎంతో ఉంటుంది. అటువంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురంకి చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ని అవమానిస్తూ అసత్యపు వార్తలను ప్రసారం చేశాడు. ఈ వార్తలన్నీ విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నందున, అలాగే ఈ వార్తలతో విజయ్ నటించే సినిమాలలోని కథానాయికలను అవమానిస్తూ ప్రసారం చేసాడు. విజయ్ టీము ఇది గుర్తించి అతను చేసిన యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.

vijaydeverakonda2.jpg

కేసు నెంబర్: 2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి వార్తలు ఎవరి మీద చేసిన అలాగే ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2023-12-13T17:22:29+05:30 IST